సర్పంచ్ పైనే కన్నేశాడు: ఒంటరిగా ఉందని 'రేప్'యత్నం, కర్నూలులో దారుణం
ఆమె ఒంటరిగా ఉందన్న విషయాన్ని గమనించి అత్యాచారానికి యత్నించాడు.
Recommended Video

హైదరాబాద్: ఇటీవల వివాహేతర సంబంధాలు, వివాహిత స్త్రీల పట్ల అసభ్య ప్రవర్తనతో పోలీసులు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోను ఓ ఎస్సై ఏకంగా ఎ మహిళా సర్పంచ్ పైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
కర్నూలు జిల్లా సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు వూటుకూరు సర్పంచ్ పద్మజను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. నాలుగు నెలల నుంచి సెల్ ఫోన్ ద్వారా అసభ్యకర మెసేజ్, ఫోన్ కాల్స్ ద్వారా ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఇదే క్రమంలో దీపావళి సందర్భంగా ఎస్ఐ ఏడుకొండలు వూటుకూరు వచ్చాడు. సర్పంచ్ పద్మజ ఇంటికెళ్లిన అతను.. ఆమె ఒంటరిగా ఉందన్న విషయాన్ని గమనించి అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఎస్ఐని ప్రతిఘటించిన ఆమె.. అతని నుంచి తప్పించుకుని స్థానికుల సహాయంతో పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు బాధితురాలికి అండగా నిలిచాయి. ఎస్ఐని విధుల నుంచి తప్పించి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకుండా పోతే ఇక సామాన్య ప్రజల సంగతేంటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications