ఆమెను తనతో గడపాలన్నాడు: ఆ ఎస్ఐపై మూడు నెలల సస్పెన్షన్..

Subscribe to Oneindia Telugu

ఏలూరు: కృష్ణా, గోదావరి జిల్లాల్లో పోలీసుల ఆగడాలు మితిమీరుతున్నాయి. మహిళలను వేధిస్తూ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.

కేసు తప్పించాలంటే నాతో గడపాల్సిందే: వివాహితపై ఎస్ఐ లైంగిక వేధింపులు

కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన బ్యూటీషియన్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమె భర్తను వేధింపులకు గురిచేస్తున్న ఎస్ఐ విజయ్ కుమార్‌పై వేటు పడిన వారం రోజుల్లోనే ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది.

si venkata kumar suspended for sexual harassment on woman

నూజివీడు ఎస్సై వెంకటకుమార్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. స్థానికంగా ఉండే ఓ మహిళను వెంకటకుమార్ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి.

భర్తకు సంబంధించిన కేసు విషయంలో సదరు వివాహిత ఒకసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఫోన్ నంబర్ తీసుకున్న వెంకట కుమార్.. అప్పటినుంచి ఆమెను వేధిస్తున్నాడు. తనతో గడిపితే భర్తపై కేసు లేకుండా చేస్తానని బెదిరించాడు.
దీంతో ఉన్నతాధికారులను ఆశ్రయించిన బాధితురాలు.. ఎస్ఐ వెంకటకుమార్ వాయిస్ రికార్డింగ్స్ ను ఎస్పీకి సమర్పించి ఫిర్యాదు చేసింది.

ఎస్ఐ రాసలీలలు: ఆమె భర్తే వీడియో లీక్ చేశాడు.. సోషల్ మీడియాలో చక్కర్లు

విచారణకు ఆదేశించిన ఎస్పీ.. వెంకటకుమార్ ట్రాక్ రికార్డు చెక్ చేశారు. గతంలోను అతనిపై పలు వివాదాలు ఉండటంతో మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nuziveedu SI Venkata Kumar suspended for harassing a woman sexually. Departmental inquiry submitted a report to SP

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి