తిరుమల క్షేత్రంపై నుంచి విమానాలు వెళ్లొచ్చు: సిద్ధేశ్వర భారతీస్వామి, కానీ..
తిరుపతి: కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వర భారతీస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల క్షేత్రం మీదుగా గగనతలంలో విమానాలు వెళ్లవచ్చని, అయితే శ్రీవారి గర్భాలయంపై నుంచి మాత్రమే విమానాలు వెళ్లరాదని పేర్కొన్నారు. తిరుమల గిరిపై భక్తుల సౌకర్యార్థం రోప్‌వే, హెలిప్యాడ్ కూడా నిర్మించవచ్చని అన్నారు.
ఆదివారం తిరుమలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి నామాల అంశాన్ని వివాదాస్పద చేయడం సరికాదన్నారు. ఆచార వ్యవహారాలకు అనుగుణంగా శ్రీవారికి రోజూ గంట విరామం ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఇటీవల ఓ విమానం శ్రీవారి గర్భగుడి పైనుంచి వెళ్లడంతో టిటిడి అధికారులు విమానాశ్రయ అధికారులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, వాతావరణం సరిగా లేని కారణంగానే తిరుమల గుడిపై నుంచి విమానం ప్రయాణించాల్సి వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి కొందరు భక్తులు వెలుపల వేచివున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాగా, శనివారం స్వామివారిని 82,210మంది భక్తులు దర్శించుకున్నారు












Click it and Unblock the Notifications