సిద్దిపేట ఆదర్శంగా ముందుకు: కెసిఆర్, హెలిప్యాడ్ వద్ద మంటలు(పిక్చర్స్)

కరీంనగర్: పట్టుదల, సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంపై నిర్మించిన సిద్దిపేట తాగునీటి సరఫరా పథకాన్ని ఆదర్శంగా తీసుకుంటామని కెసిఆర్ అన్నారు.

బుధవారం మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఫిల్టర్ బెడ్ ఆవరణలో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ఇంజనీర్లతో కలిసి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యాంను, అనంతసాగర్, సిద్దిపేట నియోజకవర్గానికి అందిస్తున్న తాగునీటిపై సిఎం ఏరియల్ సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17 సంవత్సరాల క్రితం తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం నానా అవస్థలు పడ్డారని, అలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించి లోయర్ మానేర్ డ్యాం నుంచి నీటిని తరలించుకువచ్చేందుకు రూపకల్పన చేశామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

పట్టుదల, సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రంలో చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంపై నిర్మించిన సిద్దిపేట తాగునీటి సరఫరా పథకాన్ని ఆదర్శంగా తీసుకుంటామని కెసిఆర్ అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

బుధవారం మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఫిల్టర్ బెడ్ ఆవరణలో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ఇంజనీర్లతో కలిసి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యాంను, అనంతసాగర్, సిద్దిపేట నియోజకవర్గానికి అందిస్తున్న తాగునీటిపై సిఎం ఏరియల్ సర్వే నిర్వహించారు.

కెసిఆర్

కెసిఆర్

17 సంవత్సరాల క్రితం తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం నానా అవస్థలు పడ్డారని, అలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించి లోయర్ మానేర్ డ్యాం నుంచి నీటిని తరలించుకువచ్చేందుకు రూపకల్పన చేశామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

సిద్దిపేట నియోజకవర్గానికి సమగ్ర నీటి సరఫరా పథకం - విజయోత్సవం (2000-2014)లో భాగంగా బుధవారం బెజ్జంకి మండలం హన్మాజీపల్లి గ్రామం నుంచి సిద్దిపేటకు తాగునీరు సరఫరా చేస్తున్న ఇన్‌టెక్‌వెల్ కమ్ పంప్‌హౌజ్ నిర్మాణాన్ని పరిశీలించారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ పథకంతో విజయవంతంగా మారుమూల ప్రాంతాలకు కూడా తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా తాగునీటి సరఫరా పథకాన్ని అధికారులకు, ఇంజినీర్లకు విశ్లేషించారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ పథకం నిర్మాణానికి తాను వ్యక్తిగతంగా ఎంతో శ్రమ పడినట్లు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ పీడిత 180 గ్రామాలకు తాగునీటిని అందించగలిగామని వివరించారు.

కెసిఆర్

కెసిఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం కరీంనగర్ జిల్లా పర్యటనలో చిన్న అపశృతి చోటుచేసుకుంది.

కెసిఆర్

కెసిఆర్

సిఎం పర్యటన సందర్భంగా ముందుగా సిఎం సెక్యూరిటీ ఐజి ఎంఎం భగవత్ వస్తున్న హెలిక్యాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు లోకేషన్ చూపించే ‘స్మోక్'ను పోలీసు అధికారులు వదలారు.

కెసిఆర్

కెసిఆర్

ఆ స్మోక్ పొగ రవ్వలు పైకి వెళ్లి వచ్చి కిందపడి హెలిప్యాడ్‌లో ఉన్న ఎండిన వరిగడ్డి పోచలకు అంటుకోవడంతో మంటలు చేలరేగాయి.

కెసిఆర్

కెసిఆర్

అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. మంటలను చూసిన పోలీసు అధికారులు పరుగు పరుగున హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+