AP Politics: నివురుగప్పిన నిప్పులా ఏపీ ? ఫలితాలపై నిఘా హెచ్చరికల వెనుక ?

ఏపీలో ఈసారి ఎన్నికల్లో నమోదైన భారీ పోలింగ్ శాతంపై దేశమంతా చర్చించుకుంటోంది. అదే సమయంలో పోలింగ్ రోజు మొదలైన హింసాత్మక ఘటనలు మూడు రోజుల పాటు కొనసాగడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే పోలింగ్ శాతం పెరగడానికీ, హింసాత్మక ఘటనలకు కూడా లింక్ ఉందన్న చర్చ జరుగుతోంది. తమ అభిమాన పార్టీలకు ఎలాగైనా గెలిపించుకోవాలన్న పట్టుదల పోలింగ్ శాతం పెంపుతో పాటు హింసకూ కారణమైంది.

ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయాలు ఎన్నికల పోలింగ్ వేళ బహిర్గతం అయ్యాయి. ఐదేళ్లుగా తమను అణగదొక్కిన అధికార పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ విపక్ష నాయకులు చెలరేగిపోయారు. అదే సమయంలో విపక్షం నుంచి ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చిన నేతల్ని టార్గెట్ చేస్తూ అధికార పక్ష నేతలు కూడా రెచ్చిపోయారు. దీంతో పల్నాడుతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. సహజంగానే వీటిని నిఘా వర్గాలు ఊహించలేదు.

silent fire behind post-election ap politics as intel warns more attacks after results

ఎన్నికల పోలింగ్ తో అంతా ముగిసిపోయిందని నిఘా వర్గాలు చేతులు దులుపుకున్నాయి. దీంతో ఐదు జిల్లాల్లో ఎన్నికల తదనంతర హింస చెలరేగింది. చివర్లో మేల్కున్న పోలీసులు ఈసీ హెచ్చరికలతో రంగంలోకి దిగి నేతల్ని హౌస్ అరెస్టులు చేశారు. అయితే ఇప్పటికీ పరిస్ధితి నివురుగప్పిన నిప్పులాగే ఉందని తాజాగా అందుతున్న నిఘా హెచ్చరికలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఫలితాల తర్వాత మరోసారి హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందన్న నిఘా హెచ్చరికల వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి.

నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో రేపు ఎవరో ఒకరు గెలవడం ఖాయం. కానీ పథకాలపై అధికార పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకతపై విపక్షాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇందులో ఎక్కడైనా తేడా వచ్చి ఫలితాలపై ఆ ప్రభావం కనిపిస్తే మాత్రం ఎన్నికల ఫలితాల్ని కూడా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఫలితాలకు ముందు కూడా అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కారణం మాత్రం తిరిగి హోరాహోరీగా సాగిన ఎన్నికలు, రేపు తేడా వస్తే జీర్ణించుకోలేని పరిస్ధితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉండటమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+