ఎమ్మెల్సీ ఎన్నికలపై బైరెడ్డి బాంబు, జగన్‌కు 'సొంత' పార్టీ నేత ఝలక్

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఓ బాంబు పేల్చారు. ఎమ్మెల్సీ నేపథ్యంలో ఆయన వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు పోటీ చేసే విషయంలో వైసిపి జిల్లా కన్వీనర్‌ గౌరు వెంకట రెడ్డి, నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానంద రెడ్డి ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.

ఇద్దరికీ టికెటు వస్తే ఒకరు ఉపసంహరించుకుంటే ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అవుతుందనే అవగాహనకు వచ్చారని సంచలన ఆరోపణ చేశారు.

కడప ఓటమి ఎఫెక్ట్: 'త్వరలో టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యేలు, టచ్‌లో..'

Silpa win: Byreddy Rajasekhar Reddy hot comments on MLC election results

నందికొట్కూరు రాజకీయాన్ని ప్రజలు గమనిస్తూ వస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో టిడిపి, వైసిపిలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. 2014 ఎన్నికల అనంతరం నియోజకవర్గాన్ని, రాజకీయాలను భ్రష్టు పట్టించారన్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్ని కల్లో డబ్బు బలంతో టిడిపి అభ్యర్థులు గెలిచారని ఆరోపించారు. మోసపూరిత రాజకీయాలు ఎక్కువ రోజులు పని చేయవన్నారు. రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు లేకుండా పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rayalaseema Parirakahsna Samithi chief Byreddy Rajasekhar Reddy make hot comments on MLC election results in Kurnool District.
Please Wait while comments are loading...