ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు (ఫోటోలు)
రాజమండ్రి: నవ్యాంధ్ర నూతన రాజధాని 'అమరావతి' తొలి దశ నిర్మాణం 2018 నాటికి పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజమండ్రిలో సోమవారం అందించారు.
ఆ తర్వాత రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌పై హై లెవెల్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సంయుక్తంగా మీడియాకు వివరించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సింగపూర్ ప్రభుత్వం నిర్ణీత సమయంలో మాస్టర్ ప్లాన్ అందించడం ఆనందమని అన్నారు.

ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు
పవిత్ర పుష్కరాలు జరుగుతున్న సమయంలో రాజధాని మాస్టర్ ప్లాన్ చేతికందడం అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఎన్నికలముందు ఇచ్చిన మాట ప్రకారం సింగపూర్ స్థాయి రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నానన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వడం సంతోషమని అన్నారు.

ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు
భారత దేశంలో ఏ రాజధాని కూడా ఒక పద్ధతి ప్రకారం లేదన్నారు. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రజా రాజధానిలో స్మార్ట్ సిటీలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు.

ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు
ఉన్నత జీవన ప్రమాణాలు, కాలుష్యరహిత రాజధానిని నిర్మించనున్నామని బాబు ప్రకటించారు. రాజధాని నిర్మాణంలో ఐదు కోట్ల మంది సహకరించాలని చంద్రబాబు కోరారు. 7,420 చదరపు కిలోమీటర్ల పరిధిలో కేపిటల్ రీజియన్ వస్తుందన్నారు. ఇందులో 40 లక్షల మంది జనాభా నివసిస్తారని ఆయన చెప్పారు.

ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు
ఇక్కడ 1.8 మిలియన్ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలియచేశారు. రెండవ దశలో 217 చదరపు కిలోమీటర్ల వ్యవధిలో కేపిటల్ సిటీ వస్తుందని చెప్పారు. ఇందులో నివాసయోగ్యమైన అత్యున్నత భవన నిర్మాణాలు చేపడతామన్నారు. ఇక్కడ 18 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని ఆయన చెప్పారు.
ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు
ఇక సీడ్ క్యాపిటల్‌ను 16.9 చదరపు కిలోమీటర్ల వ్యవధిలో నిర్మించనున్నామని తెలిపారు. ఇందులో మూడు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఇదిలావుంటే ఐదు భాగాలుగా సెకెండ్ కేపిటల్‌ను నిర్మించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఇందులో వర్తక, వాణిజ్య సంస్థలు, నివాస గృహాలు, వాటర్ బాడీస్, వాటర్ ఫ్రంట్స్ ఉంటాయని వివరించారు.
ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు
ఇది కృష్ణానదికి ఒక భాగాన నిర్మిస్తామని తెలిపారు. రెండో కేపిటల్ రీజియన్ నిర్మాణ బాధ్యతలను తీసుకోవాలని జపాన్ ప్రభుత్వాన్ని కోరామని చంద్రబాబు చెప్పారు. జపాన్ ప్రభుత్వం ఇందుకు సానుకూలంగా స్పందించిందని అన్నారు. అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్నర్‌గా సింగపూర్ ప్రభుత్వాన్ని దీర్ఘకాలిక భాగస్వామిగా ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు.

ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు
స్విస్ ఛాలెంజ్ కింద సింగపూర్‌ను ఎంపిక చేశామని, పెట్టుబడులను ఆహ్వానించే బాధ్యత సింగపూర్‌కు అప్పగిస్తామని వివరించారు. సీడ్ కేపిటల్ నిర్మాణాన్ని పూర్తిస్థాయి పారదర్శకంగా చేపట్టడం కోసమే ఈ విధానాన్ని అవలంబిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. సీడ్ కేపిటల్ నిర్మాణంలో జపాన్‌ను కన్సార్టియం పార్ట్నర్‌గా ఆహ్వానిస్తున్నామని అన్నారు.

ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు
ఇదిలా ఉండగా అక్టోబర్ 22న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అదే రోజునుంచి పనులు ప్రారంభమవుతాయని చంద్రబాబు చెప్పారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని, సింగపూర్, జపాన్ ప్రధానులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు
రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 33 వేల ఎకరాల భూమిని సేకరించామని, ఇందులో 25 వేల ఎకరాలు ప్రభుత్వం చేతికి వచ్చిందన్నారు. దీంతోపాటు 40 వేల ఎకరాల అటవీ భూమిని కూడా తీసుకోనున్నామని బాబు చెప్పారు. భూ సమీకరణ విధానం ద్వారా రాజధానికి భూమిని సేకరించామని తెలియచేశారు.

ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు
మిగిలిన భూమిని కూడా భూ సమీకరణ విధానం ద్వారానే చేపడదామని చూస్తున్నామని, రాజకీయంగా ఎవరైనా అడ్డుతగిలితే, భూసేకరణ చట్టం ద్వారా భూమిని తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఒక్క రూపాయి తీసుకోలేదు, 22న శంకుస్ధాపన: చంద్రబాబు
ఆమరావతి నిర్మాణంలో భాగస్వాములే నిధులు సమకూర్చుతారని ఆయన వివరించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం చేపడతామని అన్నారు. రాజధాని రీజియన్ నిర్మాణ పరిధిలోకి ఏయే గ్రామాలు వస్తాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదని చంద్రబాబు చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications