వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్, బాబులతో సింగపూర్ మంత్రి భేటీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సింగపూర్ విదేశాంగ మంత్రి షణ్ముగం అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనూ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతోనూ సమావేశమయ్యారు. గురువారం ఈ భేటీలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సాయం చేయాలని కెసిఆర్ షణ్ముగాన్ని కోరారు.

కాగా, చంద్రబాబు కూడా సింగపూర్ సాయాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సింగపూర్ సాయం కోరుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. క్రమశిక్షణ, నీతి నియమాలతో సింగపూర్ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. టూరిజం, మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల్లో స్నేహపూర్వక సాయం సింగపూర్ నుంచి కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

చంద్రబాబు నాయుడిని షణ్ముగం సింగపూర్ పర్యటనకు ఆహ్వానించారు. షణ్ముగాన్ని చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.

బాబుతో షణ్ముగం భేటీ

బాబుతో షణ్ముగం భేటీ

సింగపూర్ విదేశాంగ మంత్రి షణ్ముగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాదర ఆహ్వానం పలికారు.

చంద్రబాబుతో సమావేశం

చంద్రబాబుతో సమావేశం

షణ్ముగంతో పాటు సింగపూర్ హై కమిషనర్ తదితరులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు.

షణ్ముగానికి జ్ఞాపిక

షణ్ముగానికి జ్ఞాపిక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ విదేశాంగ మంత్రి షణ్ముగానికి జ్ఞాపికను ఆందించారు.

షణ్ముగానికి కెసిఆర్ ఆహ్వానం

షణ్ముగానికి కెసిఆర్ ఆహ్వానం

తనను కలవడానికి వచ్చిన సింగపూర్ విదేశాంగ మంత్రి షణ్ముగానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సాదర ఆహ్వానం పలికారు.

షణ్ముగం బృందంతో సమావేశం

షణ్ముగం బృందంతో సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో షణ్ముగంతో పాటు సింగపూర్ హై కమిషనర్ కూడా సమావేశమయ్యారు.

English summary

 K Shanmugam, minister of foreign affairs, singapore met AP CM N Chandrababu Naidu and Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X