ఏసీబీ వలలో భారీ చేప: కూలీగా మొదలెట్టి, కోట్లు సంపాదించాడు (ఫోటోలు)
అమరావతి: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోణపల నేపథ్యంలో జీవీఎంసీ జోన్ 2 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీరమాధవరావుకు చెందిన ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు విశాఖలోని ఆయన ఇంటితోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
డాబాగార్డెన్స్, ఎండాడ, దసపల్లా, పెందుర్తి, పి.ఎం.పాలెం, భీమిలి, దేవరాపల్లితో పాటు పలు ప్రాంతాల్లో జరిపిన ఈ సోదాల్లో బంగారం, వెండి ఆభరణాలు, నగదు, ఇళ్లు, స్థలాలకు చెందిన పత్రాలు బయటపడ్డాయి. బుధవారం సాయంత్రం వరకు జరిపిన సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 1.5 కోట్ల విలువైన ఆక్రమాస్తులను గుర్తించారు.
విశాఖ నగరానికి చెందిన కె. వీరమాధవరావు 1988లో జీవీఎంసీలో మజ్దూర్‌గా చేరారు. అలా పని చేస్తూనే డిప్లొమో పూర్తి చేశారు. అనంతరం బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారు. దాంతో పాటే పదోన్నతులూ వర్తించాయి. వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా, టాన్ ప్లానింగ్ అధికారిగా, ఎ.ఇగా ప్రస్తుతం జోన్ 3 పబ్లిక్ వర్క్స్ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కూలీగా మొదలెట్టి, కోట్లు సంపాదించాడు
గత్తేదారుల నుంచి ప్రతీ పనికి వాటాలు వసూలు చేస్తున్నాంరటూ ఆయనపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఆయన ఆస్తిపాస్తులపై ఆరా తీసిన ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మొత్తం 8 చోట్ల సోదాలు చేసి పుస్తక విలువ ప్రకారం రూ. 2 కోట్ల ఆస్తులను గుర్తించింది.

కూలీగా మొదలెట్టి, కోట్లు సంపాదించాడు
బహిరంగ మార్కెట్లో రూ. 10 కోట్ల విలువ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. రికార్డుల ప్రకారం ఆదాయానికి మించి ఆస్తులు కనబడుతున్నాయని ఏసీబీ అధికారులు చెప్పారు. సోదాల్లో భాగంగా వెతుకున్న కొద్దీ ఆస్తులు బయటపడుతున్నాయని దాడులకు నాయకత్వం వహించిన ఏసీబీ డీఎస్పీ కె.రామకష్ణప్రసాద్ చెప్పారు.

కూలీగా మొదలెట్టి, కోట్లు సంపాదించాడు
ఆయన అందించిన వివరాల ప్రకారం వీరమాధవరావుకు డాబాగార్డెన్స్‌లో మూడు జీ+2, ఒక జీ+1 భవనాలు ఉన్నాయి. దేవరాపల్లి మండలం ఈతంపేటలో 8 ఎకరాల పామాయిల్ తోట, పెందుర్తి ఎస్‌వీఎల్‌ఎన్ టవర్స్‌లో ఒక ఫ్లాట్, ఎండాడలో ఒక ప్లాటు, భీమిలి మండలం కొత్తవలస 500 గజాల స్థలాలు ఉన్నట్లు తేలింది.

కూలీగా మొదలెట్టి, కోట్లు సంపాదించాడు
దీంతో పాటు భీమిలిలో 300 గజాలు, చీమలాపల్లిలో 187 గజాలు, డాబాగార్డెన్స్‌లో 145 గజాలు, దేవరాపల్లి మండలం తాడువాయిలో 50 సెంట్ల స్థలాలు ఉన్నట్లు లభించిన డాక్యుమెంట్లను బట్టి తేలింది. అలాగే ఒక ఫోర్డు కారు, 20 తులాల బంగారం, ఆర కేజీ వెండితో పాటు రూ. 50 వేల నగదు సోదాల్లో లభించాయి.

కూలీగా మొదలెట్టి, కోట్లు సంపాదించాడు
దొండపర్తి ఆంధ్రా బ్యాంక్‌కు చెందిన లాకర్ తాళాలు, మాధవరావు కుమార్తె పేరుతో పి.ఎం.పాలెంలోని కెనరా బ్యాంక్ లాకర్‌కు సంబంధించి తాళాలు లభించాయి. మాధవరావు డ్రైవర్ ఇంట్లో ఎస్‌వీఎన్‌ఎల్ టవర్స్‌లోని ఫ్లాట్‌కు చెందిన పత్రాలు స్వాధీన పరుచుకున్నారు.

కూలీగా మొదలెట్టి, కోట్లు సంపాదించాడు
ఇప్పటివరకు వేసిన లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 1.50 కోట్లు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ. 15 కోట్లపైగా ఉంటుందని చెప్పారు. మాధవరావుకు ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయన్నది ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

కూలీగా మొదలెట్టి, కోట్లు సంపాదించాడు
మాధవరావు అగ్రిగోల్డ్‌లో చేరి డైరెక్టర్ స్థాయికి ఎదిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన గుర్తింపుకార్డును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిజానికి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రైవేట్ సంస్ధల్లో విధులు నిర్వర్తించకూడదు. తన భార్య ఆ సంస్ధలో పనిచేస్తున్నట్టు ఆయన ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

కూలీగా మొదలెట్టి, కోట్లు సంపాదించాడు
స్థానిక సింగ్ హోటల్ జంక్షన్‌కు చెందిన ఆయన 1987లో సాధారణ ఎన్నెమ్మార్‌గా జీవీఎంసీలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. డిప్లోమో చేసి 1997లో వర్క్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం పొందారు. 2005-06లో బీఈ చేసి అసిస్టెంట్ ఇంజినీర్ హోదా పొందారు. ఆ తర్వాత బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా ఐదేళ్లు చేసిన అనంతరం ప్రస్తుతం వర్క్స్ ఏఈఈగా పని చేస్తున్నారు.












Click it and Unblock the Notifications