ఆంధ్రాలో సినీ ఫక్కీలో మానవ అక్రమరవాణా.. కేసు విచారణకు ఏర్పాటైన సిట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. విదేశీ ఉద్యోగాలంటూ ఏపీ ప్రజలను మోసం చేస్తున్న కొందరు వారిని విదేశీ ముఠాలకు విక్రయించడం వెలుగులోకి రావడంతో, మానవ అక్రమ రవాణా కేసులో పోలీసులు పురోగతి సాధించారు . తాజాగా ఆంధ్రాలో మానవ అక్రమ రవాణాకు సంబంధించి కేసు విచారణ చేయడానికి విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేశారు.
ఏపీలో మానవ అక్రమ రవాణా కేసు దర్పాప్తుకు సిట్
విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకి 20 మందితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక జాయింట్ సీపీ, ఇద్దరు సిఐలు, నలుగురు ఎస్ఐలు, 12 మంది హెడ్ కానిస్టేబుల్ లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. అసలు ఇంతకీ ఈ మానవ అక్రమ రవాణా వ్యవహారంలో ఏం జరిగిందంటే..

విదేశాలలో ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణా
విదేశాలలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్ కుమార్ అని వ్యక్తి సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రకటనలను చూసి అది నిజమని నమ్మిన కొందరు అతనికి ఒక్కొక్కరు లక్ష 50 వేల రూపాయల చొప్పున చెల్లించారు. 150 మంది నిరుద్యోగులు విదేశాలలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు అతనిని నమ్మి బయలుదేరారు.
కంబోడియాకు ఆపై చైనా గ్యాంగ్ కు విక్రయం
వీరిని బ్యాంకాక్ సింగపూర్ మీదుగా కాంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ వీరిని రిసీవ్ చేసుకుని కాంబోడియాలో ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ తర్వాత ఆ గ్యాంగ్ వీరిని వీరి టాలెంట్ ను బట్టి చైనా ముఠాకు అమ్మివేసింది. వారిలో ఉన్న నైపుణ్యం ఆధారంగా ఒకొక్కరిని 2500 నుంచి 4వేల డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు.
బలవంతంగా సైబర్ నేరాల ఊబిలోకి భారతీయులు
ఇక అక్కడ వీరితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. అయితే ఈ చైనా గ్యాంగ్ పై సోమవారం కొందరు తిరుగుబాటు చేసి వారితో వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇక అక్కడి నుండి తప్పించుకొని నగరానికి వచ్చిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.
బాధితుల వీడియో సందేశాలతో రంగంలోకి ఎంబసీ .. బాధితులకు టోల్ ఫ్రీ నంబర్
ఇక ఇప్పటికే నిన్న కొందరు బాధితులు అక్కడ నిర్వాహకులు తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని విశాఖ పోలీసులకు వాట్సప్ ద్వారా వీడియో సందేశాలు పంపించారు. రంగంలోకి దిగిన ఇండియన్ ఎంబసీ 360 మంది భారతీయులను వారి చెర నుండి కాపాడింది. ఇక దీనిపై సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ +85510642777 ను సంప్రదించాలని సూచించింది.
మానవ అక్రమ రవాణాపై దర్యాప్తుకు సిట్
ఆపరేషన్ కాంబోడియాతో వెలుగులోకి వచ్చిన మానవ అక్రమ రవాణాకు సంబంధించి కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి ఏపీ వేదికగా జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ పై విచారణ చేపట్టడానికి విశాఖ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications