ఎవరీ కసిరెడ్డి, మద్యం స్కాం వెనుక - సాయిరెడ్డి గుట్టు రట్టు..!!

ఏపీలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో మద్యం స్కాం జరిగిందంటూ విచారణకు ఆదేశించింది. ప్రత్యేక సిట్ ఈ విచారణ కొన సాగిస్తోంది. ఈ కేసులో పలువురి ప్రమేయం పైన సమాచారం సేకరిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో సుప్రీంకోర్టు నుంచి రిలీఫ్ పొందారు. కాగా, ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు వైసీపీలో అసలు ఎవరీ కసిరెడ్డి అనే చర్చ మొదలైంది. కసిరెడ్డి గురించి సాయిరెడ్డి చెప్పిన అంశాలతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

కీలక పరిణామాలు
వైసీపీ హయాంలో వేల కోట్ల లిక్కర్ అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి టీడీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఈ వ్యవహారాల పైన విచారణకు ఆదే శించారు. నాడు ఏపీబీసీఎల్ లో పని చేసిన అధికారుల నుంచి పలువురిని విచారించారు. ఈ కేసు లో మనీ లాండరింగ్ జరిగిందని తాజాగా పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీ లావు శ్రీ క్రిష్ణ దేవరాయు లు ప్రస్తావన చేసారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి వివరించారు. ఈ కేసులో ఈడీ జోక్యం చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే మిథున్ రెడ్డి తన కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానం ఆశ్రయించారు. సుప్రీంలో మిథున్ కు తాత్కాలికంగా రిలీఫ్ దక్కింది.

sit-issues-another-notice-for-kasireddy-rajasekhar-reddy-in-liquor-scam

కసిరెడ్డికి నోటీసులు
ఈ లిక్కర్ స్కాంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పార్టీ శ్రేణులకు పెద్దగా తెలియని ఈ కసిరెడ్డి అసలు జగన్ హయాంలో ఏం చేసారనే చర్చ మొదలైంది. వైసీపీలో క్రియా శీలకంగా వ్యవహరించి.. బయటకు వచ్చిన విజయ సాయిరెడ్డి సైతం లిక్కర్ స్కాంలో కర్మ, కర్త, క్రియ అంతా కసిరెడ్డి అంటూ బాంబు పేల్చారు. ఈ కేసులో మరింత సమాచారం అవసరమైన సమయంలో ఇస్తానని చెప్పుకొచ్చారు. కసిరెడ్డికి కేసు విచారిస్తున్న సిట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఇచ్చిన రెండు నోటీసులపై హైకోర్టులో చుక్కెదురవడంతో ఆయన తప్పని సరిగా విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికలకు ముందు జగన్‌తో కలసి పనిచేసిన రాజ్‌ కసిరెడ్డి... వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెరవెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి.

Take a Poll

సాయిరెడ్డి గుట్టు రట్టు
కసిరెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలో అక్కడ లిక్కర్ బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం అమ్మకాలు, కొనుగోళ్లలో చక్రం తిప్పారని చెబుతారు. ఈ కేసుల విచారణ ఎదుర్కొన్న వాసుదేవ రెడ్డి సైతం కసిరెడ్డి పేరు చెప్పినట్లు సమాచారం. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలో... ఏ రోజు, ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయిం చాలో రాజ్‌ కసిరెడ్డే నిర్ణయించేవారని చెబుతున్నారు. అసలు జగన్ కు కసిరెడ్డిని దగ్గర చేసిందే విజయ సాయిరెడ్డి అనేది మరో వాదన. అదే సాయిరెడ్డి తాజాగా కసిరెడ్డి పేరు బయట పెట్టారు. కాగా, నోటీసులు ఇవ్వటం పైన అసలు ఈ కేసుతో తనకు ఏం సంబంధం అని కసిరెడ్డి ప్రశ్నించి నట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు కసిరెడ్డికి తాజా నోటీసుల జారీతో విచారణకు వస్తారా.. రారా.. రాకపోతే విచారణ అధికారులు ఏం చేస్తారనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+