గుట్టు రట్టు చేసిన సాయిరెడ్డి - మిథున్ రెడ్డికి ఉచ్చు, కీలక పరిణామాలు..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ పాలన సమయంలో లిక్కర్ స్కాం జరిగిందని కూటమి నేతలు విచారణకు ఆదేశించారు. దాదాపు పది నెలల కాలంగా విచారణ సాగుతోంది. ఇప్పుడు వైసీపీ ముఖ్యుల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. మాజీ ఎంపీ సాయిరెడ్డి ఈ కేసులో విచారణకు హాజరు కానున్నారు. కాగా, ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అటు కసిరెడ్డి కోసం మరో సారి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు.. హైదరాబాద్ లో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. కీలక ఆధారాలు లభ్యం అయ్యాయ ని చెబుతున్న వేళ.. సాయిరెడ్డి - మిథున్ విచారణ ఉత్కంఠ పెంచుతోంది.

మిథున్ రెడ్డికి నోటీసులు
మద్యం స్కామ్‌లో సిట్‌ స్పీడు పెంచింది. ఇప్పటికే వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డిని ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. కాగా, సాయిరెడ్డి ఈ రోజు (గురువారం) విచారణకు హాజరు కానున్నారు. ఇదే సమయంలో మూడు సార్లు నోటీసులు జారీ చేసినా కసిరెడ్డి స్పందించ లేదు. దీంతో, ఆయన తండ్రికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక.. కసిరెడ్డి ని ఈ నెల 19న విచారణ కు హాజరవ్వాలంటూ సిట్ మరో సారి తాఖీదులు జారీ చేసింది. కాగా, ఇప్పుడు వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రేపు (శుక్రవారం) సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆదేశించినట్లు సమాచారం.

sit-issues-notices-to-mp-mithun-reddy-in-liquor-scam-details-here

వారితో కలిపి విచారణ
ఇదే సమయానికి మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను కూడా విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వీరిని మిథున్‌ రెడ్డితో కలిపి ప్రశ్నించి... కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే...మిథున్ విచారణకు హాజరవుతారా, లేదా అనే అంశంపై ఉత్కంఠ నెల కొంది. ఆయనకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించినప్పటికీ... విచారణకు సహకరించా లని స్పష్టం చేసింది. మరో వైపు రాజ్‌ కసిరెడ్డికి 'సిట్‌' మరో నోటీసు జారీ చేసింది. ఒకవైపు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తూనే... తాజాగా ఈ నెల 19న విచారణకు రావాలంటూ నోటీసు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు సిట్‌ విచారణకు డుమ్మా కొట్టిన రాజ్‌ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లు, భార్య పేరుతో పెట్టుబడులు పెట్టిన ఆసుపత్రిలో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో సిట్‌ సిబ్బంది సోదాలు జరిపారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్న రాజ్‌ కసిరెడ్డి తండ్రి ఉపేందర్‌ రెడ్డిని కూడా ప్రశ్నించారు. మద్యం స్కామ్‌తో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతల విచారణ వేళ అవరమైన సమాచారం రాబట్టే ప్రయత్నాలు సిట్ చేస్తోంది.

Take a Poll

సాయిరెడ్డి గుట్టు రట్టు
ఈ సమయంలో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఈ రోజు సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ మొత్తం కసిరెడ్డి అంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మద్యం కేసులో విచారణకు వస్తే తనకు తెలిసిన సమాచారం ఇస్తానని గతంలోనే సాయిరెడ్డి స్పష్టం చేసారు. ఇప్పుడు సాయిరెడ్డి వైసీపీకి దూరమయ్యారు. బీజేపీ కి దగ్గర అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో సాయిరెడ్డి సిట్ ముందుకు వస్తే ఎలాంటి వివరాలు వెల్లడిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. కసిరెడ్డి విచారణకు రాకపోతే.. సిట్ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. కసిరెడ్డి పాత్ర ఏంటి అనేది స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. దీంతో, ఈ రెండు రోజుల్లో మద్యం కేసులో చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+