Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా: మనసు అంగీకరించట్లేదు: పవన్ కల్యాణ్

అమరావతి: పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని చిత్రం యూనిట్ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ సాయంత్రం భీమ్లా నాయక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ ప్రోగ్రామ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. పవన్ కల్యాణ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Recommended Video

    Bheemla Nayak: Ticket Rates పెంపు Pawan Kalyan భీమ్లా నాయక్ కి లాభమేనా ? | Oneindia Telugu

    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా కన్నుమూయడం ప్రజలకు దిగ్భ్రాంతికి గురి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ దుబాయ్‌ ఎక్స్‌పోలో తీరిక లేకుండా గడిపిన ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చిన మరుసటి రోజే గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ఇక లేరనే విషయాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేకపాటి కుటుంబం అభిమానులు జీర్ణించుకోలేకపోతోన్నారు.

    Sithara entertainments announced Bheemla Nayak Pre Release event postponed, here is the reason

    మేకపాటి మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఉన్నత విద్యావంతుడు, వివాదరహితుడిగా పేరున్న గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మేకపాటి మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నాయకుడు సంతాపం వ్యక్తం చేస్తోన్నారు.

    టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. మేకపటి హఠాన్మరణం పట్ల జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాప సూచకంగా- ఈ సాయంత్రం నిర్వహించ తలపెట్టిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేసినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.

    రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలను నిర్వహిస్తోన్న మంత్రి మేకపటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో విషాద ఛాయలు నెలకొన్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి మనసు అంగీకరించట్లేదని చెప్పారు. అందుకే ఈ ఈవెంట్‌ను వాయిదా వేశామని అన్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించబోయేది వెల్లడిస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఇతర పూర్తి వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+