"ధురంధర్"కి పోటీగా పాక్ మూవీ.. కలెక్షన్స్ చూస్తే కన్నీళ్లే దిక్కు !!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన మూవీ "ధురంధర్". ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కింది. ఫస్ట్ పార్ట్ కంటే కూడా రెండో పార్ట్ భారీ హిట్ కొట్టింది. ఈ మూవీలో నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా చేయగా.. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. 'ధురంధర్ ' మొదటి పార్టుని కేవలం హిందీలో మాత్రమే ముందు రిలీజ్ చేయగా.. సెకండ్ పార్టుని హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో దక్షిణాది భాషలన్నింటిలోనూ చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది ఈ చిత్రం.
కాగా ఈ మూవీకి పోటీగా పాకిస్తాన్ చిత్ర పరిశ్రమలో భారీ ఆశలతో తెరకెక్కింది Mera Lyari సినిమా. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. విడుదలకు ముందు "ఇది పాకిస్తాన్ సినీ పరిశ్రమకు గేమ్ ఛేంజర్ అవుతుంది" అంటూ ప్రచారం చేసిన చిత్ర బృందానికి ప్రేక్షకులు మాత్రం షాకింగ్ రిజల్ట్ ఇచ్చారు. విడుదలైన వారంలోపే థియేటర్ల నుంచి మాయమైంది. భారతీయ బ్లాక్‌బస్టర్ Dhurandharకు పోటీగా నిలుస్తుందని భావించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం బిగ్ షాక్ గా మారింది.

కరాచీ 'ల్యారీ' ప్రాంతం నేపథ్యంలో కథ..
ఈ చిత్రాన్ని కరాచీలోని ప్రసిద్ధ Lyari ప్రాంతం నేపథ్యంలో రూపొందించారు. ఫుట్‌బాల్‌కు పేరుగాంచిన ఈ ప్రాంతంలోని యువత జీవితం, వారి కలలు, పేదరికం, గ్యాంగ్ కల్చర్, సామాజిక ఒత్తిళ్లు, జీవన పోరాటాలను దర్శకుడు వెండితెరపై చూపించే ప్రయత్నం చేశారు. స్థానిక యువ ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ, రియలిస్టిక్ స్టైల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలోని కథాంశం భావోద్వేగాలతో పాటు స్పోర్ట్స్ డ్రామా తరహాలో సాగుతుందని ప్రచారం చేశారు. ల్యారీ ప్రాంత యువత ఫుట్‌బాల్ ద్వారా జీవితాన్ని మార్చుకోవాలనే ప్రయత్నం కథలో ప్రధానాంశంగా నిలిచింది. ట్రైలర్ విడుదలైన సమయంలో సోషల్ మీడియాలో కొంత చర్చ జరిగినా, అది థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురాలేకపోయింది.
షాకింగ్ కలెక్షన్స్.. కేవలం 22 టిక్కెట్లు
కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, ఈ చిత్రం మొత్తం రన్‌లో కేవలం 22 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని సమాచారం. కొన్ని షోలలో ఒక్క ప్రేక్షకుడు కూడా లేకపోవడంతో థియేటర్ యజమానులు షోలను మధ్యలోనే రద్దు చేసినట్లు చెబుతున్నారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు కూడా రాకపోవడంతో, విడుదలైన కొద్ది రోజులకే అన్ని ప్రదర్శనల నుంచి సినిమాను తొలగించారని అంటున్నారు. పాకిస్తాన్ బాక్సాఫీస్ చరిత్రలో ఇంత దారుణమైన ఫలితం చాలా అరుదుగా కనిపిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ సినిమా వైఫల్యానికి ప్రధాన కారణం సరైన ప్రమోషన్ లేకపోవడమే అని భావిస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారం కూడా పరిమితంగానే సాగిందని.. సినిమాలో ఎక్కువగా కొత్త నటీనటులు ఉండటం, పెద్ద స్టార్ వాల్యూ లేకపోవడం ప్రేక్షకులను ఆకర్షించలేకపోయిందని భావిస్తున్నారు. అదే సమయంలో భారీ బడ్జెట్ చిత్రాలు, అంతర్జాతీయ కంటెంట్ OTTలలో అందుబాటులో ఉండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ సినీ పరిశ్రమకు ఈ ఫలితం మరో పెద్ద దెబ్బగా మారింది. గత కొన్నేళ్లుగా థియేటర్లు మూతపడటం, విదేశీ సినిమాలపై ఆధారపడటం, స్థానిక చిత్రాలకు ఆదరణ తగ్గిపోవడం వంటి సమస్యలు అక్కడి పరిశ్రమను కుదేలు చేస్తున్నాయి. 'మేరా ల్యారీ'లాంటి ప్రయోగాత్మక చిత్రాలకు సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడం కూడా మరో కారణంగా చెప్పబడుతోంది. సినిమా కేవలం 22 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయన్న వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications