ఓటుకు నోటు లేకుంటే: బాబుకు శివాజీ షాక్, జగన్‌కు వరుసగా.. ఊరట

ఓటుకు నోటు కేసు లేకుంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని ప్రముఖ నటుడు శివాజీ షాకింగా కామెంట్స్ చేశారు.

చిత్తూరు: ఓటుకు నోటు కేసు లేకుంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని ప్రముఖ నటుడు శివాజీ షాకింగా కామెంట్స్ చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు విలేకరులతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా అంశంలో ఏమీ లేదని ముఖ్యమంత్రే స్వయంగా అంటున్న నేపథ్యంలో ఇంకా దాని గురించి మాట్లాడానికి ఏమీ లేదన్నారు. శ్రీవారి సాక్షిగా ఇప్పటి ముఖ్యమంత్రే రాష్ట్రానికి పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని గతంలో కోరారన్నారు.

ముఖ్యమంత్రి ఏది చెబితే అదే రామాయాణం, మహాభారతమని వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రజల తరపున పోరాడే పరిస్థితి లేదన్నారు. కాగా, చంద్రబాబు ఓటుకు నోటు కేసు కోసం ప్రత్యేక హోదాను పణంగా పెట్టారని వైసిపి అధినేత జగన్ విమర్శించిన విషయం తెలిసిందే.

జూన్ నుంచి తాను ఓ సినిమాలో నటించబోతున్నట్టు చెప్పారు. తిరుమలలో టిటిడి ఏర్పాట్లు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. మంచి మనుషులున్నంత కాలం దేవస్థానం మెరుగుపడుతుందన్నారు.

జగన్‌కు పరోక్షంగానైనా మద్దతు..

జగన్‌కు పరోక్షంగానైనా మద్దతు..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పలువురి నుంచి పరోక్షంగానైన మద్దతు లభిస్తోంది. ప్రత్యేక హోదా, అగ్రిగోల్డ్ ఇష్యూ, ఇతర ప్రజా సమస్యలపై జగన్ నిలదీస్తున్నారు. ఈ విషయాలలో పవన్ కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

మంత్రులపై పురంధేశ్వరి

మంత్రులపై పురంధేశ్వరి

ఏపీ కేబినెట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరిన మంత్రులకు అవకాశం ఇవ్వడాన్ని జగన్ తప్పుబట్టారు. కేబినెట్లోకి తీసుకున్న రెండు రోజుల్లోనే బీజేపీ నేత పురంధేశ్వరి... టిడిపి ప్రభుత్వాన్ని ఈ విషయమై పరోక్షంగా ఏకిపారేశారు. బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వంలో మనం కూడా ఉన్నామని, వైసిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారని, అలా అయితే మనం కూడా ఫిరాయింపులను ప్రోత్సహించినట్లవుతుందని ఘాటు లేఖ రాశారు. ఇది జగన్‌కు అనుకూలించే విషయం. తద్వారా పరోక్ష మద్దతు అని భావించవచ్చునని అంటున్నారు.

శివాజీ సంచలన వ్యాఖ్యలు

శివాజీ సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు, నటుడు శివాజీ ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు షాకిచ్చారు. జగన్ ఎప్పటి నుంచో.. ఓటుకు నోటు కేసు కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని, ఆరున్నర కోట్ల మంది రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం చేశారని మండిపడుతున్నారు. ఇప్పుడు శివాజీ.. ఓటుకు నోటు కేసు లేకుండే ప్రత్యేక హోదా వచ్చేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్‌కు మద్దతు

జగన్‌కు మద్దతు

సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక్కరొక్కరు షాకిస్తున్నారు. ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్, పొత్త విషయంలో పురంధేశ్వరి వంటి టిడిపి నేతలు, ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు శివాజీ, పలు సంఘాలు స్పందించడం చంద్రబాబుకు చిక్కులే అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+