ఏపీలో తీవ్ర విషాదం.. ఆరుగురు చిన్నారుల మృతి !
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని చిగలి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నీటి కుంటలో ఈతకు దిగిన ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామమంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.
ఘటన ఎలా జరిగింది?
చిగలి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు.. గ్రామ శివారులోని కొండ ప్రాంతంలోని నీటి కుంటకు వెళ్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ కుంట నీటితో నిండిపోయింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఈతకు దిగగా లోతులోకి వెళ్లి బయటపడలేకపోయారు. ఈత రాని కారణంగా ఒక్కసారిగా ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. వారిలో ఒక విద్యార్థి మాత్రమే కుంట నుంచి బయటపడి, వెంటనే గ్రామానికి పరుగెత్తి వెళ్లి పెద్దలకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు చేరుకునేలోపే ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

ఒకేసారి ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో చిగలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తూ తల్లడిల్లిపోతుండగా, పాఠశాల లోని వారి స్నేహితులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. చిన్నారుల మరణం వార్త విని గ్రామమంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
కాగా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద వార్త తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కుంటలు, చెరువులు, వాగులు నీటితో నిండిన సమయంలో పిల్లలు ఈతకు దిగి ప్రాణాలు కోల్పోకుండా.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఇటువంటి ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications