వందేభారత్ పై విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్
రైల్వే ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు ప్యాసింజర్ సర్వీస్ అగ్రిమెంట్ (YSA)ని ప్రవేశపెడుతున్నాయి. దీనికింద వందే భారత్ రైళ్లల్లో ఆరు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా చెన్నై-విజయవాడ, చెన్నై-మైసూరు, చెన్నై-తిరునెల్వేలి, చెన్నై-కోయంబత్తూరు, తిరువనంతపురం-కాసరగోడ్ మార్గంలో వీటిని అమలు చేస్తున్నారు.
ప్రయాణికులకు ఆహారం, పానీయాల కోసం ప్రత్యేకమైన మెనూ ఉంటుంది. ఎంచుకోవడానికి మరిన్ని ఆప్షన్లు ఉంటాయి. రకరకాల రుచులను, ఫ్లేవర్లనూ రైలులో ప్రయాణిస్తూ ఆస్వాదించేందుకు వీలవుతుంది. ప్రయాణాన్ని సులువుగా చేసేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు వారికి అవసరమైన ఉపకరణాలను అందించనున్నారు. ఇంటి నుంచి ప్రయాణికులను పిక్, డ్రాప్ చేయడానికి క్యాబ్ సర్వీస్ లభిస్తుంది. ఎక్కడా సమయం వృథా అవకుండా ఉంటుంది. సాధ్యపడుతుంది.

దివ్యాంగులు, నిరుపేద ప్రయాణికుల కోసం స్టేషన్‌లో వీల్‌చైర్ అసిస్టెంట్‌లను ఏర్పాటు చేయడంద్వారా పేదవారు, దివ్యాంగులు రైల్వే స్టేషన్ నుంచి త్వరగా బయటకు వెళ్లేందుకు లేదంటే త్వరగా రైలు దగ్గరకు చేరుకునేందుకు వీలవుతుంది. ఇన్ఫోటైన్‌మెంట్ ఏర్పాట్లు చేయనున్నారు. రైలులో సినిమా లేదా మీకు నచ్చిన ఏదైనా ప్రోగ్రామ్‌ని చూడొచ్చు. లాంగ్ జర్నీ చేసేవారు ఏమాత్రం బోర్ లేకుండా జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కోచ్‌లో నైపుణ్యం కలిగిన హౌస్‌కీపింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ సంస్థ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి వీరు శిక్షణ పొందివుంటారు.












Click it and Unblock the Notifications