'పవన్ కాబోయే సిఎం!': వైసిపి నేతలూ వచ్చారు, రైతుల వ్యాఖ్యలతో మంత్రుల కౌంటర్
అమరావతి: 'కాబోయే సీఎం పవన్ కళ్యాణ్' అంటూ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆదివారం నాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులను భూసేకరణ పైన సమస్యలు అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పలువురు అభిమానులు పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం అంటూ నినదించారు. సభా వేదిక వద్ద సిపిఎం, రైతు, వ్యవసాయ సంఘాల నేతలతో పాటు వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కనిపించారు. అయితే, ఇప్పుడే తనకు పూర్తిస్థాయి రాజకీయాలు ఆసక్తి లేదని పవన్ చెప్పారు.

కాగా, ల్యాండ్ పూలింగ్ కింద జారీ చేసిన నోటిఫికేషన్ నిబంధనలను చదివి ప్రభుత్వానికి భూములివ్వవచ్చని మీరు చెబితే సంతోషంగా ఇచ్చేస్తామని రైతులు పవన్ కళ్యాణ్‌తో చెప్పిన విషయం తెలిసిందే.

ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ కింద భూములను ప్రభుత్వానికి ఇవ్వకపోవడానికి గల కారణాలను పవన్ కళ్యాణ్ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఓ రైతు మాట్లాడుతూ... ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ చదివి, మీరు ఇచ్చేయమంటే భూముల్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, రైతులకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ చెప్తే ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైతులు చెప్పారు.

ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ చెబితే తాము భూములు ఇస్తామని రైతులు చెప్పడంతో... మంత్రులు దానిని ఆసరాగా చేసుకొని మాట్లాడారు. పవన్ చెబితే ఇస్తామని వారు చెబుతున్నారని, పవర్ స్టార్ వారిని ఒప్పించాలని పలువురు సూచించారు.












Click it and Unblock the Notifications