Train: జన్మభూమి ఎక్స్ ప్రెస్‍లో పొగలు.. రైలు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు..
ఒడిశాలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన నుంచి తరుచుగా రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో పొగలు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ బోగిలో ఒక్కసారిగా పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళుకు గురై రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ట్రైన్ ను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నిలిపివేశారు.
రైలు ఆగగానే ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. ప్రయాణికులు రైలు ఏలూరు రైల్వే స్టేషన్ ఉండగానే పొగలు రావడం గుర్తించారు. అధికారులకు తెలపడంతో పొగలు రాకుండా చూశారు. దీంతో ట్రైన్ విశాఖపట్నానికి బయల్దేరింది. రైలులో మళ్లీ పొగలు రావడంతో తాడేపల్లి గూడెం వద్దు నిలివేశారు. ట్రైన్ బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

రెండు రోజుల క్రితం గుజరాత్‌లోని వల్సాడ్‌లో హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వచ్చాయి. తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ రూట్ లో వల్సాడ్ స్టేషన్ సమీపంలోకి వచ్చిన సమయంలో రైలులో మంచలు చెలరేగాయి. పక్క బోగీల్లోని ప్రయాణికులందరినీ వెంటనే దించేసినట్లు అధికారులు తెలిపారు.
అంతకు ముందు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లి - పగిడిపల్లి మధ్య ట్రైన్ లో మంటలు చెలరేగాయి. రెండు భోగీల్లో నుండి దట్టమైన పొగలు వస్తున్నట్లు గమనించిన సిబ్బంది అప్రమత్తమై రైలుని నిలిపివేసి ప్రయాణికులను కిందికి దింపారు. ఎస్-3, ఎస్-4, ఎస్-5, ఎస్-6 భోగీలు మంటల్లో కాలిపోయాయి.












Click it and Unblock the Notifications