ఏపీలో రైళ్లను రద్దు చేసిన అధికారులు

వాల్తేరు డివిజన్ లోని కోరాపుట్-రాయగడ లైనులో టికిరి నుంచి సింగారం లక్ష్మీపూర్ రోడ్డు మధ్య రెండోలైను నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్ లాక్ పనులు ఉండటంతో అధికారులు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈనెల 29, మే 3, 6 తేదీల్లో విశాఖ-కోరాపుట్ రద్దయింది. అలాగే కోరాపుట్-విశాఖ ఈనెల 30, మే 4, 7 తేదీల్లో కూడా రద్దయింది. విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్ ఈనెల 28 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు , కోరాపుట్ నుంచి బయలుదేరే రైలును ఈనెల 28 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు రద్దు చేశారు.

ఈనెల 17 నుంచి మే 7 వరకు రూర్కెలా-జగ్దల్పూర్ ఎక్స్ ప్రెస్ రాయగడ వద్ద షార్ట్ టెర్నినేట్ చేయబడుతుంది. జగ్దల్పూరు ఆర్ఆర్ఆర్ యూర్ నుంచి బయలుదేరుతుంది. ఈనెల 28 నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు రాయగడ-హౌరాలో బయలుదేరే రైలు టిట్లాగడ్ షార్ట్ టెర్మినేట్ చేయబడుతుంది. జగ్దల్పూర్-హౌరా టిట్లాగడ్ నుంచి రీషెడ్యూల్ చేశారు. జగ్దల్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ టిట్లాగడ్ నుంచి మే 8న రీషెడ్యూలింగ్ చేశారు.

so many trains cancellec in waltair railway division

ఆయా తేదీల్లో ప్రయాణించేవారు రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైలు పునరుద్ధరణ జరిగిన తర్వాత అందరికీ సమాచారం అందజేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈనెల 28 నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్ కూడా రద్దయిందనే విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలని సూచించారు. విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ గా ఏర్పడితే దేశం నలుమూలలకు ఇక్కడి నుంచి రైళ్లను తిప్పొచ్చు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి, షిరిడీ తదితర ప్రాంతాలకు తిరుగుతున్నప్పటికీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మాత్రం లేవంటూ విమర్శలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+