వైజాగ్, విజయవాడ, గుంటూరు ప్రజలకు కేంద్రం ముఖ్య సూచన

దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే సిగ్నలింగ్ పనులను ఆధునికీకరిస్తోంది. దీనికి కారణం ఏడాది క్రితం ఒడిసాలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురవడమే. ఈ దుర్ఘటనలో 300 మందికిపైగా ప్రయాణికులు మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపంవల్లే ప్రమాదానికి కారణమని గుర్తించిన ఉన్నతాధికారులు దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. అందులో భాగంగా అన్ని జోన్ల పరిధిలో ఉన్న డివిజన్లలో పనులు జరుగుతున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో కొవ్వూరు-గోదావరి-రాజమండ్రి-కడియం సెక్షన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించబోతున్నారు. దీనికోసం ాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను రద్దు చేశారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

రద్దయిన రైళ్ల వివరాలు

తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్ (22708) సెప్టెంబ‌ర్ 29న రద్దు.
విశాఖపట్నం- తిరుపతి డబుల్ డెక్కర్ (22707) సెప్టెంబ‌ర్ 30న‌ రద్దు.
విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718) సెప్టెంబ‌ర్ 30న‌ రద్దు.
విశాఖపట్నం- విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717) సెప్టెంబ‌ర్ 30న‌ రద్దు.

so many trains cancelled in vijayawada and vizag railway division limits due to non interlocking work

విశాఖపట్నం - గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22701) సెప్టెంబ‌ర్ 30న‌ రద్దు.
గుంటూరు - విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22702) సెప్టెంబ‌ర్ 30న‌ రద్దు.
గుంటూరు - విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239) సెప్టెంబ‌ర్ 29, 30 తేదీలలో రద్దు.
విశాఖపట్నం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240) సెప్టెంబ‌ర్ 30, అక్టోబ‌ర్ 1 తేదీల‌లో రద్దు.

రాజమండ్రి-విశాఖపట్నం మెము ప్యాసింజర్ (07466 ) సెప్టెంబ‌ర్ 30న రద్దు.
విశాఖపట్నం - రాజమండ్రి మెము ప్యాసింజర్ (07467) సెప్టెంబ‌ర్ 30న రద్దు.

18 రైళ్ల‌కు స్టాప్ తొల‌గింపు
హసన్‌పర్తి - కాజీపేట 'ఎఫ్' క్యాబిన్ - వరంగల్ స్టేషన్ల మధ్య నాన్-ఇంటర్‌ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీనివల్ల దూర ప్రాంతాలకు నడిచే కొన్ని ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు వరంగల్ లో స్టాప్ ను ఈ నెలాఖరు వరకు రద్దు చేశారు. వాటి వివరాలను రైల్వే వెబ్ సైట్ లో తెలుసుకోవాలని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+