'నాకేం జరిగినా చంద్రబాబుదే బాధ్యత', రాజధానిపై సంచలన వ్యాఖ్య
తనకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని సామాజికవేత్త శ్రీమన్నారాయణ అన్నారు.
అమరావతి: తనకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని సామాజికవేత్త శ్రీమన్నారాయణ అన్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తాను ప్రశ్నిస్తున్నానని, అలా చేస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అరెస్టుకు తాను భయపడేది లేదన్నారు.

అవసరమైతే జైల్లో కూర్చొని పోరాటం చేస్తానని హెచ్చరించారు. అమరావతి భూముల విషయాన్ని 70 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారందరిపై కేసు పెడతారా అని నిలదీశారు.
ప్రభుత్వానని వ్యతిరేకిస్తున్నారని, వాళ్లందరి పైనా ప్రభుత్వం కేసులు పెడుతుందా అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications