ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్

హైదరాబాద్: పెళ్లై మూడు నెలలు కూడా గడవక ముందే ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో జరిగింది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రకాష్‍‌నగర్‌కు చెందిన రమేష్ కుమారుడు మురళీ విహర్ (29)కి తూర్పు గోదావరి జిల్లా అల్లవరం గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ఇంటర్నెట్ ద్వారా పరిచయమైంది.

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. విషయాన్ని మురళీ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో తల్లదండ్రులను ఎదిరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. హైటెక్ సిటీలోని ఓ ప్రముక సాప్ట్‌వేర్ కంపెనీలో మురళీ పని చేస్తున్నాడు.

software engineer suicide in jeedimetla, hyderabad

భార్యతో కలిసి జీడిమెట్ల అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. కాగా, నెల రోజులుగా భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.

దీంతో మనస్తాపానికి గురైన మురళీ బెడ్ రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య బెడ్‌రూంలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+