లైంగిక వేధింపులు: సాఫ్ట్‌వేర్ సంస్థ యజమానిపై కేసు

Software firm owner booked under Nirbhaya Act
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమానిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. లైంగిక వేధింపులకు పాల్పడడ్డానే ఆరోపణపై ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మానవ వనరుల (హెచ్ఆర్) మేనేజర్‌గా పనిచేస్తున్న 23 ఏళ్ల యువకుడిపై ఆ కేసు నమోదైంది.

తండ్రి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీకి హెచ్‌ఆర్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న పరమేశ్వర రావుపై ఆ కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ పి. మురళీకృష్ణ చెప్పారు. గత కొన్ని నెలలుగా 23 ఏళ్ల ఎంబిఎ మహిళా గ్రాడ్యుయేట్‌ను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

తనతో లైంగిక క్రీడకు అంగీకరిస్తే ఉద్యోగంలో ప్రమోషన్ కల్పిస్తానని, వేతనం పెంచుతానని ఆశ పెడుతూ వస్తున్నాడు. పక్షం రోజుల క్రితం అతను ఆమె చేయి పట్టుకున్నాడు. దీంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది.

రెండు రోజుల క్రితం బాధితురాలు పోలీసు స్టేషన్‌కు వచ్చి పరమేశ్వర రావుపై ఫిర్యాదు చేసినట్లు మురళీకృష్ణ చెప్పారు. ఎల్బీ నగర్‌కు చెందిన పరమేశ్వర రావు పరారీలో ఉన్నట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+