జగన్ కంటే కేసీఆర్ బెట్టర్, మరింతమంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి: వైసిపికి కేఈ షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో మేలు అని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు.

చదవండి: 'పాదయాత్ర ముగియకుండానే జగన్‌ను ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం'

వైసిపి చేసేది తప్పు

వైసిపి చేసేది తప్పు

ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను వైసిపి బహిష్కరించడం తప్పు అని కేఈ అన్నారు. అది వారికే నష్టమని చెప్పారు.

ఎమ్మెల్యేలు సభకు వస్తే టిడిపిలో చేరుతారనే భయం

ఎమ్మెల్యేలు సభకు వస్తే టిడిపిలో చేరుతారనే భయం

జగన్ పాదయాత్ర సమయంలో ఎమ్మెల్యేలు సభకు వస్తే తెలుగుదేశం పార్టీలో చేరుతారేమోననే భయం జగన్‌కు ఉందని కేఈ ఎద్దేవా చేశారు. పాదయాత్రనే కాదు, పొర్లు దండాలు చేసినా జగన్ సీఎం కాలేరన్నారు.

జగన్ ఉండటం మాకే మంచిది

జగన్ ఉండటం మాకే మంచిది

జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉంటే మాకే మంచిది అని కేఈ అన్నారు. ఆయన పాదయాత్ర చేస్తే తెలుగుదేశం పార్టీకి లాభమని చెప్పారు. వైసిపి దౌర్భాగ్య పార్టీ అని, ఆ పార్టీలో భవిష్యత్తు ఉండదని చెప్పారు.

మరికొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి

మరికొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తమను సంప్రదిస్తున్నారని కేఈ చెప్పారు. త్వరలో కొందరు టిడిపిలో చేరుతారని చెప్పారు. వైసిపిలో భవిష్యత్తు లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలుసుకుంటున్నారన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Some more YSR Congress Party MLAs will join Telugu Desam, says Deputy Chief Minister KE Krishnamurthy on thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి