టీడీపీ ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ కోవ‌ర్టులు..!?: కీల‌క స‌మాచారం చేర‌వేత : స‌హ‌క‌రిస్తుందెవ‌రు..నిఘా..!

Recommended Video

    టీడీపీ ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ కోవ‌ర్టులు..!? కీల‌క స‌మాచారం చేర‌వేత || Oneindia Telugu

    ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌రువాత కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిక‌ల కోడ్ పేరుతో ప్ర‌భుత్వ రెగ్యుల‌ర్ కార్య‌క‌లాపాలకు బ్రేకులు ప‌డ్డాయి. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల ఫ‌లితాల పైనా అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఇదే స‌మ‌యంలో కొత్త ప్ర‌చారం మొద‌లైంది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలోని కొంద‌రు అధికారులు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు పని చేస్తున్నారంటూ టీడీపీ మ‌ద్ద‌తు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కీల‌క‌మైన స‌మాచారం జ‌గ‌న్‌కు అందిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇంత‌కీ వారెవ‌రు..నిఘా పెట్టారా..

    ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ కోవ‌ర్టులు..

    ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ కోవ‌ర్టులు..

    ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా ముఖ్య‌మంత్రి..మంత్రులు స‌చివాల‌యానికి దూరంగా ఉంటున్నారు. పూర్తిగా అధికారుల పాల‌న‌లోనే రాష్ట్రం న‌డుస్తోంది. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయంగా కొన్ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు అధికారులు ఫ‌లితాలు రాక‌ముందే స‌ర్వే నివేదిక‌ల ఆధారంగా వైసీపీ అధినేత‌కు ద‌గ్గ‌ర‌య్యే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. గ‌త అయిదేళ్ల కాలంలో తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని వారు ప్ర‌స్తుత విప‌క్ష నేత‌కు చేర‌వేస్తున్నానే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక‌, కొంద‌రు అధికారులు ఇప్ప‌టికే కేంద్ర స‌ర్వీసుల నుండి జ‌గ‌న్ ఏపీలో ముఖ్య‌మంత్రి యితే తిరిగి ఇక్క‌డే ప‌ని చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ మేర‌కు వారు కొంత మంది సీనియ‌ర్ అధికారుల‌తో ట‌చ్‌లో ఉన్నారు. ఫ‌లితాల తరువాత అధికారులు ఏపీకి డిప్యుటేష‌న్ మీద వ‌చ్చేవారు ఎవ‌రనే విష‌యం పైన క్లారిటీ రానుంది.

    కీల‌క నోట్ ఫైళ్లు అందిస్తున్నారా..

    కీల‌క నోట్ ఫైళ్లు అందిస్తున్నారా..

    ఏపీలో 2014లో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యం నుండి ప్ర‌తిప‌క్ష వైసీపీ అనేక అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తోంది. వీటికి సంబంధించిన స‌మాచారం ఇప్పుడు కొంత మంది ప్ర‌భుత్వం నుండి విప‌క్ష నేత‌కు అందిస్తున్నార‌నే వార్త‌లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్నాయి. స‌మాచారంతో పాటుగా వీటికి సంబంధించిన ఆధారాల‌కు గాను కీల‌క‌మైన నోట్ ఫైళ్ల‌ను కూడా న‌క‌ళ్లు అందిస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే, వీరంతా జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తార‌నే న‌మ్మ‌కంతో ముందుగా త‌మ ప్రాబ‌ల్యం పెంచుకోవ‌టానికే ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం ఉంది. ఈ వాద‌న‌ను అధికారులు మాత్రం ఖండిస్తున్నారు. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా తాము ప‌ని చేయాల్సిందేన‌ని.. ప్ర‌భుత్వ స‌మాచారం మ‌రొక‌రికి చేర‌వేసే ప‌రిస్థితి ఉండ‌ద‌ని చెబుతున్నారు. దీంతో..వాస్త‌వాలు తెలుసుకొనేందుకు నిఘా పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

    అధికారులు క‌లిసారంటూ..

    అధికారులు క‌లిసారంటూ..

    ఈ మ‌ధ్య కాలంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను కొంత మంది అధికారులు క‌లిసార‌ని స‌మాచారం. కీలక శాఖ‌లో ఉన్న ఓ మ‌హిళా అధికారి పార్టీ నేత‌ల స‌హ‌కారంతో జ‌గ‌న్ ను క‌లిసిన‌ట్లు చెబుతున్నారు. అదే విధంగా ముందుగానే త‌మ స్థానం సుస్ధిరం చేసుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తార‌ని భావిస్తున్న ముఖ్య‌మైన అధికారులు ..తాము అనుకున్న‌ట్లుగా ప్ర‌భుత్వం ఏర్ప‌డితే తాము కోరుకున్న పోస్టులు ద‌క్కించుకోవ‌టాన‌కి ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు ప్రారంభించార‌ని అధికార వ‌ర్గాల్లో ప్రచారం. అయితే, వైసీపీ నేత‌లు మాత్రం ఈ ప్ర‌చారం పైన ఎక్క‌డా స్పందించ‌టం లేదు. ఈనెల 23న ఫ‌లితాల త‌రువాత ఈ ప‌రిణామాలు మ‌రింత వేగంగా చోటు చేసుకొనే అవ‌కాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+