ఎన్నికలకు ముందు ఏం జరిగింది, ఆ అధికారులు?, చంద్రబాబు ఆర్డర్ కోసం!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలువురు అధికారులు బదిలీలు అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది అధికారులను వేరే వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసిల్దార్లను వారి సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో పనిచేస్తున్న తహసిల్దార్లు వారివారి సొంత జిల్లాలకు బదిలీ అయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు బదిలీలు అయిన చాలా మంది తహసిల్దార్లు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వారికి నచ్చిన ప్రాంతాల్లో పోస్టింగ్ తెచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 40 మంది తహసిల్దార్లను అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొరుగు జిల్లాలకు బదిలీ చేశారు. ఇటీవల ఆ 40 మంది తహసిల్దార్లను ఉమ్మడి అనంతపురం జిల్లాకి బదిలీ చేశారు. ఆ తహసిల్దార్లు మొత్తం అనంతపురం కలెక్టరేట్ లో రిపోర్టు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాత అసలు కథ మొదలైంది.

ఈనెల రెండో తేదీన ఆ 40 మంది తహసిల్దార్లకు పోస్టింగ్ ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే అందులో 35 మంది తహసిల్దార్లకు పోస్టింగ్ లు ఇస్తూ కలెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐదు మంది తహసిల్దార్లకు ఇంతవరకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. బదిలీ అయిన 35 మంది తహసిల్దార్లలో వారివారి ప్రాంతాలకు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. అయితే మిగిలిన తహసీల్దార్లకు మాత్రం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ తహసిల్దార్లకు అసలు పోస్టింగ్ ఇస్తారా లేదా ? అనేది తెలియడం లేదని ఓ సీనియర్ అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు వంతపాడిన తహసిల్దార్లకు ప్రాధాన్యత లేని ప్రాంతాల్లో పోస్టింగ్ లు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ తహసిల్దార్లలకు మాత్రం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గత వైసీపీ ప్రభుత్వం లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేశారని, మాతో చెడుగుడు ఆడుకున్న పోలీసు అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులకు ప్రాధాన్యత లేని ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వాలని టీడీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications