104 మందిని 420గా మార్చాడు: జగన్‌పై సోమిరెడ్డి

కెసిఆర్ తన తన జీవిత కాలమంతా అందరినీ తిడుతూనే ఉంటారని ఆయన అన్నారు. తెలంగాణ బాగు కోసం కెసిఆర్ ఒక్క పనైనా చేశాడా అని ఆయన అడిగారు. తన రాజకీయాల వల్ల ఎంత మంది అనాథలయ్యారో కెసిఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోతే కెసిఆర్ కుటుంబ సభ్యులంతా చల్లగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రతి ఏడూ బహిరంగంగా ఆస్తులు ప్రకటిస్తున్న నేత దేశంలో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కరేనని ఆయన చెప్పారు. జనవరి 3వ తేదీన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన ఆస్తులను ప్రకటిస్తానని చెప్పారని, బినామీలా ఆస్తులు కూడా ప్రకటిస్తారా అని ఆయన అన్నారు. ఎంత మంది బినామీల ఆస్తులు ప్రకటిస్తారో చూస్తామని ఆయన అన్నారు.
సొంత జిల్లా విజయనగరంలోనే బొత్సపై ప్రజలు తిరగబడ్డారని, బొత్స అక్రమ ఆస్తులపై ప్రజలు తిరగబడితే సైనికులను కాపలా పెట్టుకోవాల్సి వచ్చిందని సోమిరెడ్డి అన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సోమిరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications