వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు పబ్లిక్, జగన్ ప్రయివేట్, అందుకే హైదరాబాద్ వదలట్లేదు: దులిపేసిన సోమిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ఎప్పుడు ప్రయివేటేనని, చంద్రబాబు ఎప్పడూ పబ్లిక్కే అన్నారు. చంద్రబాబు ఇంటిపై వైసిపి నేతలు, జగన్ మీడియా అవాస్తవ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మీడియాతో కలిసి చంద్రబాబు ఇంటిని చూపించేందుకు సిద్ధమని చెప్పారు. జగన్ తన బంగళాలను మీడియాకు చూపిస్తారా? అని సవాల్ విసిరారు. ఏపీలో అడుగుపెట్టడమే జగన్‌కు ఇష్టం లేదన్నారు.

<strong>కేసుల ఎఫెక్ట్: జగన్‌కు సొంత ఎమ్మెల్యేలు షాకిస్తారా?</strong>కేసుల ఎఫెక్ట్: జగన్‌కు సొంత ఎమ్మెల్యేలు షాకిస్తారా?

Somireddy challenges YS Jagan on Chandrababu Naidu's residence

చంద్రబాబు ఇంటిపై దుష్ర్పచారం జరుగుతోందన్నారు. జగన్ మాదిరిగా చంద్రబాబుకు బంగళాలు లేవని చెప్పారు. భువనేశ్వరి స్థలంలోనే కొత్తగా ఇల్లు కట్టుకున్నారన్నారు.

చంద్రబాబు కొత్త ఇల్లు పేరిట వైసిపి శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్న చిత్రాలతో కూడిన ఇల్లును చూపిస్తే వారికే దాన్ని రాసిచ్చేస్తామని సోమరెడ్డి అన్నారు.

40 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని కష్టార్జితంతో పునర్నిర్మించుకుంటే దానిపై కూడా నీచ ప్రచారం చేయడం వైసిపికే చెల్లిందన్నారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ అని, అదే జగన్‌వి అన్నీ ప్రయివేట్ లిమిటెడ్‌ కంపెనీలేనని అన్నారు.

2004 తర్వాత బెంగళూరు, లోటస్‌పాండ్‌, ఇడుపుల పాయ, కడపల్లో అతి పెద్ద విలాసవంతమైన భవనాలు జగన్‌కు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.

జగన్‌ బెంగళూరులోని తన ఇంటిని పాత్రికేయ బృందానికి చూపించేందుకు సిద్ధమైతే, తానే దగ్గరుండి హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన చంద్రబాబు ఇంటిని చూపిస్తాన్నారు. ఐటీ రిటర్నులు, ఎన్నికల ప్రమాణపత్రాలు, ఆస్తుల ప్రకటన సందర్భంలో చూపించిన ఆదాయం, ఆస్తుల వివరాలకు లోబడే చంద్రబాబు తన ఇంటిని నిర్మించుకున్నారన్నారు.

అమరావతిలో ఎటూ తనకు, తన పార్టీకి భవిష్యత్తు ఉండదన్న ఆందోళనతోనే జగన్‌ లోటస్‌పాండ్‌ను విడిచిపెట్టి అమరావతికి రావడం లేదని విమర్శించారు.

కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ: రామాననుజయ

కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ కొద్ది నెలల్లో పూర్తి అవుతుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ అన్నారు. కొంతమంది బీసీలు చేస్తున్న ఆందోళన వెనక జగన్ కుట్ర ఉందని ఆరోపించారు.

కాపు కార్పొరేషన్ ద్వారా 80 వేల మందికి రుణాలు ఇచ్చామని రామానుజయ తెలిపారు. బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తామని స్పష్టం చేశారు.

English summary
Minister Somireddy Chandramohan Reddy on Wednesday challenged YSRCP chief YS Jagan on Chandrababu Naidu's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X