ఆ ఘనత వైసీపీకే దక్కింది: 'అధ్యక్షుడిగా జగన్ పనికిరాడు'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగే నైతిక అర్హత జగన్‌కు లేదని ఆయన విమర్శించారు. ఓ రాజకీయ పార్టీ ఆఫీసుని దేశ చరిత్రలోనే ఈడీ అటాచ్ చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని అన్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేశాక పార్టీ కార్యాలయాన్ని ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. జగన్‌కు నైతిక విలువలుంటే పార్టీని మూసివేయాలని లేదంటే అధ్యక్షుడినైనా మార్చుకోవాలని ఆయన సూచించారు. తనను నమ్ముకున్న వాళ్లను జైలుకు పంపిన ఘనత జగన్‌దేనని వ్యాఖ్యానించారు.

somireddy

ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. 2004లో జగన్ వార్షిక ఆదాయం రూ. 9 లక్షలు మాత్రమేనని, ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పన్ను చెల్లింపుదారుగా ఎలా మారారని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఈనెల 8వ తేదీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై కూడా ఆయన విమర్శించారు. గడపగడపకు వెళితే వైసీపీకి ఎదురయ్యేది అవమానాలేనని ఆయన అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ 'గడపగడపకు వైసీపీ' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Somireddy chandramohan reddy fires on ys jagan ed attachment.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి