వైసీపీ చేసింది 'జీరో'.. అదొక చేతకాని దద్దమ్మల పార్టీ: సోమిరెడ్డి

Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైసీపీ ఒక చేతకాని దద్దమ్మల పార్టీ అని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ మండిపడ్డారు. దేశంలో వైసీపీ లాంటి ప్రతిపక్షాన్ని ఎక్కడా చూడలేదని మండిపడ్డారు.

అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడాన్ని సోమిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. నాలుగేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పోషించిన పాత్ర 'జీరో' అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయం విషయమై తమ పార్టీ ఎంపీలతో 2016లోనే రాజీనామా చేయిస్తానని జగన్ అన్నారని, ఇప్పటికీ అవే మాటలు చెబుతున్నారని విమర్శించారు.

somireddy chandramohan reddy fires on ys jagan mohan reddy

వైసీపీ ఎంపీలు నిజంగా రాజీనామాలు చేయదలుచుకుంటే.. వారికి ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రంపై అవిశ్వాసం పెడుతామని జగన్ అంటున్నారని, అలా చేసినంత మాత్రాన బీజేపీ ప్రభుత్వం కూలుతుందా? అని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎంపీలతోనే రాజీనామా చేయించలేని జగన్.. ఢిల్లీలోనూ చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదం అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhrapradesh Minister Somireddy Chandramohan Reddy criticized YS Jagan over state issues, Somireddy said YSRCP is zero in state

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి