ప్రీతిపాత్రుడు కాబట్టే కెసిఆర్‌కు అంత టైమ్: సోమిరెడ్డి

 Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు అధిష్టానం అనుసరిస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) రాజకీయ పార్టీలకు 15, 20 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావుకు గంటా పది నిమిషాలు సమయం ఇచ్చిందని, ప్రీతిపాత్రుడు కాబట్టే కెసిఆర్‌కు అంత సమయం ఇచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెసు నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ధ్వజమెత్తారు.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు ధ్వంసం చేశారని సీమాంధ్రపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కక్ష పెట్టుకున్నారని, ఆంధ్ర అని అంటే సోనియా మండిపడుతున్నారని ఆయన అన్నారు. తాను ఏది చెప్తే అది ఈ దేశానికి జరగాలని ఇటలీకి చెందిన సోనియా గాంధీ అనుకుంటున్నారని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. సమైక్యమని చెబుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగితే ఏం కావాలో చెబుతూ నివేదిక ఇచ్చారని, దామోదర రాజనర్సింహ తెలంగాణ కోసం నివేదిక ఇచ్చారని, కాంగ్రెసు నాయకులు నాలుగు విభిన్నమైన నివేదికలు ఇచ్చే కర్మ పట్టిందని ఆయన అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సమాచారం ఉందని, దాన్ని తీసుకుని ఏం కావాలో జాతీయ పార్టీల నాయకుల ముందు పెట్టి విభజనపై చర్చించాలని ఆయన అన్నారు. జివోఎం సమావేశాల్లో రాజకీయ పార్టీల నాయకులతో ఏం మాట్లాడుకున్నారో తెలియదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన శాస్త్రియంగా జరగడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి అన్నారని గుర్తు చేస్తూ శాస్త్రియంగా జరిగితే విభజించాలని చెబుతున్నారా అని ఆయన అడిగారు.

కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తుంటే అడ్డుకునే దమ్ము కిరణ్ కుమార్ రెడ్డికి లేదని, సమన్వయ కమిటీ సమావేశంలో మెడలు వంచి, కిరణ్ రెడ్డి విభజనకు అంగీకరించారని దిగ్విజయ్ సింగ్ చెప్పారని, మొత్తంగా మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయాల్లో తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు బచ్చా అని, కెటిఆర్ తండ్రి కెసిఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టింది తమ పార్టీయేనని సోమిరెడ్డి అన్నారు. ఎవరు చినిపోయినా, ఎవరు త్యాగాలు చేసినా కెటిఆర్ కుటుంబమే వాడుకుందని ఆయన విమర్శించారు. మెట్రో రైలు ప్రాజెక్టు వస్తే ఆరోపణలు చేశారని ఆయన అన్నారు.

ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజిస్తామని చెప్పే హక్కు ఎవరికీ లేదని, శాసనసభను గౌరవించి తీరాలని, శాసనసభ తీర్మానం చేసి పంపిస్తే పార్లమెంటు మాత్రమే రాష్ట్రాన్ని విభజించగలదని ఆయన అన్నారు. జీవోఎం సభ్యులు సమావేశం మధ్య నుంచి లేచిపోతున్నారని, అంత ఆషామాషిగా తీసుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో అతి పెద్ద తప్పిదానికి పాల్పడుతున్నారని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, కాంగ్రెసు అనుభవించక తప్పదని ఆయన అన్నారు. మూడు నెలల్లో మాజీ ప్రధాని కాబోయే మున్మోహన్ సింగ్ ఈ రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+