వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీపార్వతిని వైసీపీ అధ్యక్షురాలిని చేయండి: జగన్‌కు సోమిరెడ్డి సవాల్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌పై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌పై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.

లక్ష్మీపార్వతిని అధ్యక్షురాలిని చేయండి

లక్ష్మీపార్వతిని అధ్యక్షురాలిని చేయండి

అంత ప్రేమ ఉంటే లక్ష్మీపార్వతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు.

జగన్‌తోపాటు కేసులే కేసులు

జగన్‌తోపాటు కేసులే కేసులు

వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిపై 12 కేసులుంటే.. ఆ పార్టీ జిల్లాల అధ్యక్షులపై అరడజను చొప్పున కేసులున్నాయని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తే తాము పోరాడుతామని, అక్కడ మీ(వైయస్సార్ కాంగ్రెస్) పార్టీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ అంటే ప్రాణం

ఎన్టీఆర్ అంటే ప్రాణం

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు అంటే తమ ప్రాణంఅని, పార్టీ పుట్టినప్పుట్నుంచి పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు వేదికపైనా, కిందా ఉన్నారని సోమిరెడ్డి అన్నారు. మహానాడు ప్రాంగణంలోని మీడియా కేంద్రం వద్ద ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు.

అందుకే బాలయ్య రాలేదు

అందుకే బాలయ్య రాలేదు

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ గట్టిగా కోరుతోందని.. మహానాడులో ఈ మేరకు తీర్మానం కూడా చేశామన్నారు. ఎన్టీఆర్‌ తనయుడు, సినీ నటుడు బాలకృష్ణ విదేశాల్లో ఉండటంతో మహానాడుకు రాలేకపోయారని.. జూనియర్‌ ఎన్టీఆర్‌ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

English summary
Andhra Pradesh minister Somireddy chandramohan reddy said that Laxmi Parvathi should be YSRCP president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X