జగన్‌కు అదే ఆత్రం: సోమిరెడ్డి నిప్పులు, ‘వైసీపీకి కిలారి రోశయ్య షాక్!’

Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కుర్చీ కోసం, పదవి కోసం ఆత్రం తప్ప జగన్‌కు ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టడంలేదని సోమిరెడ్డి విమర్శించారు.

  YS Jagan Padayatra : కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ | Oneinda Telugu
  సంస్కారహీనుడు..

  సంస్కారహీనుడు..

  ప్రజలకు జగన్‌ అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి జగన్‌ సంస్కార హీనంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. జగన్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.

  రెచ్చగొట్టి.. ముడుపులపాయ..

  రెచ్చగొట్టి.. ముడుపులపాయ..

  ప్రజలను రెచ్చగొట్టి, ప్రజా శాంతికి విఘాతం కలిగించాలని జగన్‌ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇడుపులపాయ పెద్ద ముడుపులపాయ అని మరో మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. చంద్రబాబు మంచి సంకల్పంతో పాదయాత్ర చేస్తే జగన్‌ మాత్రం స్వార్థం కోసమే పాదయాత్ర చేస్తున్నారని ఆక్షేపించారు.

  వైసీపీని వీడనున్న రోశయ్య

  వైసీపీని వీడనున్న రోశయ్య

  2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా వైసీపీకి మరో ఝలక్ ఇచ్చేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ పార్టీకి చెందిన కాపు నేత కిలారి రోశయ్య వైసీపీని వీడే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

  మనస్తాపంతోనే..

  మనస్తాపంతోనే..

  ఇదే అంశమై కాపు నేతలు, తన అనుచరులతో కలిసి ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. వైసీపీలో తనకు అన్యాయం జరుగుతోందని రోశయ్య మనస్తాపం చెందినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh ministers Somireddy Chandramohan Reddy and Kalva srinivasulu fired at YSRCP president Jaganmohan Reddy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి