బాబు దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదు: సోమిరెడ్డి

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ నిర్ణయానికి నిరసనగానే చంద్రబాబు దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విడిపోతున్న సీమాంధ్రకు కాకుండా తెలంగాణకు పరిహారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అనడం దుర్మార్గమని ఆయన అన్నారు.
కేంద్రానిది అపరిపక్వత
తెలంగాణపై కేంద్రం అపరిపక్వతతో వ్యవహరిస్తోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంద్రుల్లో భయాందోళనలు తొలగించాలన్నారు.
తెలంగాణను కాంగ్రెస్ సొంత వ్యవహారంలా భావిస్తోందని, సొంత పార్టీ నేతల అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications