అది పనికి రాదు.. చూద్దాం: పవన్ కళ్యాణ్‌పై సోమిరెడ్డి, జగన్‌పై ఆధారాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా మంచి మనిషి అని, అలాంటి వ్యక్తి రాజకీయాలకు అంతగా పనికి రాడనేది తన అభిప్రాయమని ఏపీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

రాజకీయాల్లో ఉన్నానని చెప్పేందుకే జగన్ అలా..: టిడిపి నేత ఆసక్తికరం

తాను పెట్టుబడులు పెట్టలేనని, ఎన్నికల్లో గెలుస్తానో లేదో తెలియదని పవన్ చెబుతుంటారని, ఇది రాజకీయ నాయకుడికి పనికి రాదన్నారు. రాజకీయాల్లో స్ట్రాంగ్‌గా ఉండాలన్నారు. పవన్ మంచి వారని, ప్రజల మంచి కోరుకుంటారని కితాబిచ్చారు.

పవన్ సలహాలు తీసుకుంటున్నాం.. యాక్టివ్ అవుతున్నాం

పవన్ సలహాలు తీసుకుంటున్నాం.. యాక్టివ్ అవుతున్నాం

పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాలను అవసరమైతే తమ ప్రభుత్వం కూడా స్వీకరిస్తోందని సోమిరెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ విమర్శించలేదని చెప్పారు. ఎక్కడైనా తప్పులు ఉంటే పవన్ చెబుతున్నారని, దాని వల్ల సంబంధిత మంత్రి, శాఖ యాక్టివ్ అవుతున్నారని చెప్పారు.

పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు.. చూద్దాం ఏమవుతుందో

పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు.. చూద్దాం ఏమవుతుందో

పవన్ కళ్యాణ్ లోపలొకటి పెట్టుకునే వ్యక్తి కాదని, అయితే స్ట్రాటజిస్ట్ మాత్రం కాదని సోమిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్నారని, ఏమవుతుందో చూద్దామన్నారు.

ఆధారాలున్నాయి.. జగన్ బయటపడలేడు

ఆధారాలున్నాయి.. జగన్ బయటపడలేడు

వైసిపి అధినేత వైయస్ తనపై ఉన్న కేసుల్లో నుంచి బయటపడే ప్రసక్తే లేదని సోమిరెడ్డి అన్నారు. జగన్ పైన అడిషనల్ ఛార్జీషీట్ సహా పన్నెండు కేసులు ఉన్నాయని, ఈ కేసులన్నింటికీ సంబంధించి ఆధారాలు ఉన్నాయని, వీటి నుంచి బయట పడటమనే ప్రసక్తే లేదన్నారు.

అలా అని లేదు

అలా అని లేదు

తాను ఎవరినీ ఎదగనీయననే మాటల్లో ఎటువంటి వాస్తవం లేదని, ఆ కల్చర్ తెలుగుదేశం పార్టీలో లేదని, తనకు మంత్రి ఇవ్వొద్దని నెల్లూరులో ఎవరూ వ్యతిరేకించలేదని, జగన్‌ను తిట్టేందుకే తన కెరీర్ పరిమితం కాలేదని, రెడ్డిని రెడ్డే తిట్టాలన్న నిబంధనేదీ టిడిపిలో లేదని సోమిరెడ్డి అన్నారు.

ఎందుకు ఓడిపోయానంటే...

ఎందుకు ఓడిపోయానంటే...

ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మా గాంధీ వచ్చి పోటీ చేసి.. తాను డబ్బు ఇవ్వనని, బ్రాందీ ఇవ్వననో అంటే గెలిచే పరిస్థితులు లేవని సోమిరెడ్డి అన్నారు. తన ఓటమికి గురించి ఆయన పై విధంగా చెప్పారు. తాను ఓడినా గెలిచినా తన లైఫ్ స్టయిల్ ఒకేలా ఉంటుందన్నారు. గతంలో ఓడిపోతానని తెలిసినా పార్టీ ఆదేశం మేరకు పోటీ చేయాల్సి వచ్చిందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Somireddy says Pawan Kalyan is very good persons but he is unfit for politics.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి