‘‘పెద్ద పందికొక్కు’జగన్‌ను రాళ్లతో కొట్టాలి! అగ్ని గుండలా రాష్ట్రం’

Subscribe to Oneindia Telugu
జగన్‌ను రాళ్లతో కొట్టాలి! జగనే పెద్ద పందికొక్కు, సమాధి తప్పదు ? | Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు జగనే ప్రధాన అడ్డంకి అంటూ దుయ్యబట్టారు. కేంద్రానికి రహస్యంగా లేఖలు రాస్తూ.. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఇందుకు జగన్‌ను రాళ్లతో కొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కూర్చీ కోసం కలలు కంటూ.. ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నారని సోమిశెట్టి మండిపడ్డారు.

జగనే పెద్ద పందికొక్కు

జగనే పెద్ద పందికొక్కు

జగన్ తన పాదయాత్రలో ఇస్తున్న హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని అన్నారు. ఎమ్మెల్యేలను జగన్ పందికొక్కులు అంటున్నాడని... వారికి టికెట్లు ఇచ్చిన జగనే పెద్ద పందికొక్కు అని అన్నారు.

 బీసీలంటే గౌరవం లేదు

బీసీలంటే గౌరవం లేదు

జగన్‌కు బీసీలంటే గౌరవం లేదని... పాదయాత్రలో వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని సోమిశెట్టి అన్నారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య గురించి పదేపదే మాట్లాడుతున్న జగన్... బీసీ కులానికి చెందిన సోమన్న అదృశ్యం గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

 జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు

జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు

జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని... 2019లో ఆయనకు రాజకీయ సమాధి తప్పదని సోమిశెట్టి వెంకటేశ్వర్లు జోస్యం చెప్పారు. జగన్‌కు నాయకత్వ లక్షణాలు లేవని అన్నారు.

 జగన్ వల్ల అగ్నిగుండంలా ఏపీ..

జగన్ వల్ల అగ్నిగుండంలా ఏపీ..

సొంత ఛానల్, సొంత పత్రికలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ.. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డిపై సోమిశెట్టి తీవ్రంగా మండిపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP leader Somisetty Venkateswarlu fired at YSRCP president YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి