ముందు దీనికి జవాబు చెప్పు: టీడీపికి వీర్రాజు దిమ్మతిరిగే ప్రశ్న, పవన్ కళ్యాణ్ కలిస్తేనే..

అమరావతి: తనపై టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న తదితరులు చేసిన విమర్శలపై బీజేపీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. తనపై విమర్శలు చేసే వెంకన్న లాంటి వాళ్లు తనకు స్నేహితులేనని చెప్పారు. పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ కలిస్తేనే చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పారు.

తాను ఎవరికీ భయపడేది లేదని చెప్పారు. ఎవరో రాసిస్తేనే తెలుగుదేశం పార్టీ నేతలు తనపై విరుచుకుపడుతున్నారని చెప్పారు. తాను ఎవరి స్క్రిప్ట్‌ను చదవడం లేదన్నారు. అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు మంత్రి పదవులు ఇవ్వడంపై తొలుత టీడీపీ సమాధానం చెప్పాలని దిమ్మతిరిగే షాకిచ్చారు.

నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది బీజేపీ

నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది బీజేపీ

తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది టీడీపీ కాదని, బీజేపీ అని వీర్రాజు చెప్పారు. జనసేన, టీడీపీ, బీజేపీ.. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే ప్రభుత్వం ఏర్పాటయిందని చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌తో నాకు, మా పార్టీకి (బీజేపీ) సంబంధం లేదని చెప్పారు.

గతి తప్పితే గట్టిగా సమాధానం చెబుతాం

గతి తప్పితే గట్టిగా సమాధానం చెబుతాం

గతి తప్పి మాట్లాడే వాళ్లకు ధీటుగా తాము కూడా సమాధానం చెప్పగలమని సోము వీర్రాజు అన్నారు. తాను క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చెబుతున్నానని అన్నారు. తనకు ఎలాంటి సొంత అజెండా లేదన్నారు. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పానని తెలిపారు. తనకు టీడీపీతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.

వాస్తవాలు జీర్ణించుకోలేక నా ఇల్లు ముట్టడి

వాస్తవాలు జీర్ణించుకోలేక నా ఇల్లు ముట్టడి

ఏ పార్టీ అయినా బహిరంగ సభలు పెట్టినప్పుడు విరాళాలు వసూలు చేయడం సహజమే అని సోము వీర్రాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుందని చెప్పారు. వసూలు, ఖర్చును రాష్ట్ర పార్టీకి జమ చేసే సంప్రదాయం కూడా తమకు ఉందని తెలిపారు. వాస్తవాలు చెబితే జీర్ణించుకోలేని వారు తన ఇల్లును ముట్టడిస్తున్నారని చెప్పారు.

 మేం విడిపోతామని చెప్పలేదు, వాళ్లే నమస్కారం అన్నారు

మేం విడిపోతామని చెప్పలేదు, వాళ్లే నమస్కారం అన్నారు

తెలుగుదేశం పార్టీతో విడిపోతామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు సోము వీర్రాజు. అవసరమైతే దండం పెట్టి వెళ్తామని అన్న వారే ఆ విషయం చెప్పాలని చంద్రబాబుకు, టీడీపీకి చురకలు అంటించారు. బడ్జెట్ ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదన్నారు. ఈ బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై కసరత్తు జరుగుతోందన్నారు. ఏపీ అభివృద్ధి బీజేపీ లక్ష్యమని చెప్పారు. కాగా, అంతకుముందు టీడీపీ నేతలు సోము వీర్రాజు ఇంటిని చుట్టుముట్టారు. దీనిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+