అన్నీ అమరావతిలోనే ఎందుకు, ఉత్తరాంధ్ర రాయలసీమ పట్టవా?: సోమువీర్రాజు

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ బీజేపీ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కేంద్రం ఇచ్చిన హామిలను పూర్తి చేయడానికి ఇంకా చాలా సమయం ఉందని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ ఉద్యమాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

చాలా మంది టచ్‌లో, రాజ్యసభ ఎన్నికలపై అధిష్టానానిదే తుది నిర్ణయం: సోము వీర్రాజు

  TDP leaders Protest BJP MLC's Remarks Against Babu
   అన్నీ అమరావతిలోనే ఎందుకు?:

  అన్నీ అమరావతిలోనే ఎందుకు?:

  టీడీపీ ప్రభుత్వం అభివృద్దినంతా అమరావతిలోనే కేంద్రీకరిస్తుందని, ఇది సరికాదన్న రీతిలో సోము వీర్రాజు మాట్లాడారు.

  అమరావతిలోనే 20 ఆసుపత్రులు నిర్మించాల్సిన అవసరమేంటని.. వాటిలో కొన్నింటిని ఉత్తరాంద్ర , రాయలసీమల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.

   ఒంగోలు గురించి కూడా..:

  ఒంగోలు గురించి కూడా..:

  ప్రకాశం జిల్లా పరిస్థితి కూడా ఏమంత బాగాలేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒంగోలు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సోము వీర్రాజు సూచించారు.

   బీజేపీ రాయలసీమ మంత్రం:

  బీజేపీ రాయలసీమ మంత్రం:

  బీజేపీని టీడీపీని ఇరుకునపెడుతున్న వేళ ఉత్తరాంధ్ర, రాయలసీమల గురించి ఆ పార్టీ గట్టిగా మాట్లాడుతుండటం గమనార్హం. వెనుక బడిన జిల్లాల కోసం ఇచ్చిన నిధులతో ఉత్తరాంధ్రకు అసలేం చేశారు? అని ఇప్పటికే బీజేపీ టీడీపీని నిలదీసింది.

  అలాగే అభివృద్ది అంతా అమరావతికే పరిమితమైతే రాయలసీమ పరిస్థితేంటన్న ఉద్దేశంతో రాయలసీమ డిక్లరేషన్ తో ముందుకొచ్చింది. సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలు కూడా ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.

   రాజ్యసభ ఎన్నికలతో తేలిపోతుందా?:

  రాజ్యసభ ఎన్నికలతో తేలిపోతుందా?:

  టీడీపీ-బీజేపీ మధ్య నిజంగా వైరం నెలకొందా?.. లేక ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ రెండు పార్టీలు డ్రామా ఆడుతున్నాయా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఇలాంటి తరుణంలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు ఉండటం.. వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయన్న విషయాన్ని స్పష్టం చేయడానికి ఆస్కారం ఉంది. బీజేపీ గనుక టీడీపీకి మద్దతునిస్తే.. సీఎం చంద్రబాబు చెబుతున్న తెగదెంపుల మాటలకు జనంలో విశ్వసనీయత ఉండకపోవచ్చు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP MLC Somu Veerraju said there is no need of 20 hospitals in Amaravati, instead of that it's better to build hospitals in North andhra, Rayalaseema he suggested.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి