వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు సీఐడీ నోటీసులిస్తే కక్ష సాధింపా?: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఐడీ నోటీసులు టీడీపీ నేతలు కక్షసాధింపు అనడం హాస్యాస్పదం అని అన్నారు.

బీసీ సీఎం వ్యాఖ్యలపై సోము వీర్రాజు యూటర్న్ .. పవన్ ఒత్తిడినా ? అధిష్టానం ఆదేశాలా ? హాట్ డిస్కషన్ బీసీ సీఎం వ్యాఖ్యలపై సోము వీర్రాజు యూటర్న్ .. పవన్ ఒత్తిడినా ? అధిష్టానం ఆదేశాలా ? హాట్ డిస్కషన్

గతంలో తమపై టీడీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడలేదా? అని సోమువీర్రాజు ప్రశ్నించారు. అంతేగాక, ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు బ్లాక్ బెలూన్స్, ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్రమంత్రి అమిత్ షా.. తిరుపతి పర్యటనలో రాళ్ల దాడి చేశారని గతంలో టీడీపీ నేతల చర్యలను ఆయన గుర్తు చేశారు.

Somu Veerraju on AP CID notices to chandrababu issue

తిరుపతి పార్లమెంటు స్థానంలో బీజేపీ, జనసేనలు కలిసి పనిచేస్తాయన్నారు సోము వీర్రాజు. తిరుపతి ఎంపీ ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పవన్ కళ్యాన్‌తో చర్చించినట్లు తెలిపారు. కాగా, అమరావతి భూముల అక్రమాలపై చంద్రబాబు నాయుడుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 41వ సీఆర్పీసీ కింద ఈ నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాల్సింది నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇక చంద్రబాబునాయుడుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ కక్షసాధింపులకు పాల్పడుతోందని, దురుద్దేశంతోనే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరని అంటున్నారు. విచారణకు హాజరయ్యేందుకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి స్టేలు తెచ్చుకోకుండా విచారణకు హాజరుకావాలని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అనంతరం చంద్రబాబుకు నోటీసులు జారీ కావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గామారింది.

English summary
Somu Veerraju on AP CID notices to chandrababu issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X