వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి శత్రువే, వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాం: బాబు, బాలయ్యపై సోము ఫైర్, పవన్‌కు మద్దతుగా..

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టిన ధర్మపోరాట దీక్ష వేదికపై నుంచి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీతోటు తెలంగాణ బీజేపీ నేతలు బాలకృష్ణ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

ఇక దండోపాయమే, జాగ్రత్త: మోడీకి బాలకృష్ణ వార్నింగ్, కొజ్జాలంటూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలుఇక దండోపాయమే, జాగ్రత్త: మోడీకి బాలకృష్ణ వార్నింగ్, కొజ్జాలంటూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష గాడితప్పిందని, అది ప్రభుత్వ తీరుకు నిదర్శనమని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. దీక్ష పేరుతో రూ.30కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్ నిర్వహించినట్లుందని ఆయన అన్నారు.

మొదటి శత్రువు బాబే

మొదటి శత్రువు బాబే

దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి మొదటి శత్రువు చంద్రబాబు నాయుడేనని సోము వీర్రాజు అన్నారు. అంతేగాక, చంద్రబాబుకు మొదట్నుంచి కూడా నరేంద్ర మోడీ ప్రధాని కావడం తట్టుకోలేకపోతున్నారని అన్నారు.

 చంద్రబాబుకు చుక్కలే

చంద్రబాబుకు చుక్కలే

చంద్రబాబు నాయుడు 2019లో ఓటమి కళ్లముందే కనబడుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బీజేపీ చుక్కలు చూపిస్తుందని సోము వీర్రాజు అన్నారు. బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు సీఎం పదవికి రాజీనామా చేస్తే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

పవన్ తల్లి కూడా తిట్టించారు..

పవన్ తల్లి కూడా తిట్టించారు..

నాలుగేళ్లు ఓపిక పట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చివరకు టీడీపీ సర్కారుపై తిరగబడ్డారని సోము వీర్రాజు అన్నారు. పవన్ తల్లిని కూడా తిట్టించే కార్యక్రమం చేసిందని టీడీపీపై మండిపడ్డారు.

బాబు స్పందించాలి

బాబు స్పందించాలి

ప్రధానిపై బాలకృష్ణ వ్యాఖ్యలు దారుణమని మాజీ మంత్రి మాణిక్యాల రావు అన్నారు. బాలకృష్ణ గతంలో కూడా చాలా సార్లు ఇలాగే మాట్లాడారని అన్నారు. ప్రభుత్వ వేదికపై అన్నందుకు సీఎం చంద్రబాబు దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

దొరికిపోతాననే భయమా? బాబూ..

దొరికిపోతాననే భయమా? బాబూ..

తనపై కేసులు పెట్టేవారిపై ప్రజలు తిరగబడాలని చంద్రబాబు అంటున్నారని.. ఏ కేసులోనైనా దొరికిపోతానని తెలిసే చంద్రబాబు ఇలా అన్నారా? అని ప్రశ్నించారు. గతంలో ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్‌ను దోషిగా చేసేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీఎంను విమర్శించే వారిని దోషులు చేస్తారా? అంటూ టీడీపీపై మాణిక్యాల రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30ఏళ్ల క్రితం ఎన్టీఆర్ విషక్ష్ంలోనూ చంద్రబాబు ఇలానే చేశారని మాణిక్యాల రావు ఆరోపించారు. పవన్ చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

బాలకృష్ణను ఏ జంతువుతో పోల్చలేం

బాలకృష్ణను ఏ జంతువుతో పోల్చలేం

బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్‌లు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానిపై బాలకృష్ణ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అయితే, తాము బాలకృష్ణను ఏ జంతువుతో కూడా పోల్చలేమని, అలా చేసి వాటిని అవమానపర్చమని అన్నారు.

బాలకృష్ణను అరెస్ట్ చేయాలి, బాబుపైనా

బాలకృష్ణను అరెస్ట్ చేయాలి, బాబుపైనా

బాలకృష్ణపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, వెంటనే అరెస్ట్ చేయాలని కోరామని విష్ణుకుమార్ రాజు తెలిపారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను కూడా ఇచ్చామని చెప్పారు. అలాగే చంద్రబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. ఏపీతోపాటు తెలంగాణలోనూ పలు పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణపై బీజేపీ నేతలు ఫిర్యాదులు చేశారు.

క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలంటూ..

క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలంటూ..

కాగా, ప్రధానిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ బాలకృష్ణ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా, నెల్లూరులోని గాంధీ బొమ్మ దగ్గర బాలకృష్ణ దిష్టిమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేస్తుండగా, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ బీజేపీ నేతలు కూడా బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే హైదరాబాద్‌లో తిరగనివ్వమని హెచ్చరించారు.

English summary
BJP MLC Somu Veerraju and other BJP leaders fired at MLA Nandamuri Balakrishna for his undue comments on PM Narendra modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X