హోదా లేకపోతేనేమి!.. ఇవన్నీ చేయట్లేదా?, అసలా నిధులేం చేశారో చెప్పండి: సోము వీర్రాజు

Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీకి కేంద్రం చేయాల్సిన దాని కన్నా ఎక్కువే చేసిందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. గతంలో ఇదే మాటను స్వయంగా వెల్లడించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాత్రం మాట మార్చారని ఆరోపించారు.

  BJP MP Haribabu Press Meet On AP Projects With Statistics

  హోదాపై ప్రజల్లో అనవసర భయాందోళనలు రేకెత్తించవద్దని, ఇంకా ప్రజలను మభ్యపెట్టడానికి చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీకి ఇచ్చామని కేంద్రం చెబుతున్న నిధుల లెక్కలన్ని తప్పుల తడకలేనన్న ఆరోపణల నేపథ్యంలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.

  ఇదీ లెక్క.. ఇప్పుడు చెప్పండి: ఏపీకి కేంద్రం ఏం చేసిందంటారా?.. పూసగుచ్చినట్టు చెప్పిన హరిబాబు

  విశాఖ రైల్వే జోన్‌పై:

  విశాఖ రైల్వే జోన్‌పై:

  దేశంలో కేవలం తొమ్మిది రైల్వే జోన్లు మాత్రమే ఉన్నాయని, కొత్తగా ఏర్పడ్డ ఏ రాష్ట్రంలోనూ రైల్వే జోన్ లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలకు ఇప్పటికీ రైల్వే జోన్ లేదని, కానీ ఏపీ విషయాన్ని రైల్వే బోర్డు పరిశీలిస్తోందని అన్నారు. రైల్వే బోర్డు కమిటీ చాలా అభ్యంతరాలను లేవనెత్తిందని, అయినప్పటికీ ఆ బాధ్యత తీసుకుంటున్నామని అన్నారు.

  అసలు మీ వద్ద ప్రణాళిక ఉందా?:

  అసలు మీ వద్ద ప్రణాళిక ఉందా?:

  ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లులో పెట్టలేదని, కేవలం పరిశీలిస్తామని మాత్రమే చెప్పారని సోము వీర్రాజు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి అవసరమైన నిధులను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అందించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని తెలిపారు.

  అసలు ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం ఇచ్చే నిధులను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పక్కా ప్రణాళిక ఏమైనా ఉందా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఉంటే.. దాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  ఆ నిధులేం చేశారు?:

  ఆ నిధులేం చేశారు?:

  ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనుకబడిన జిల్లాల కోసం కేంద్రం గతంలో రూ.2010కోట్లు కేటాయించిందని, ఇందులో రూ.1500కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. ఆ నిధులతో ప్రభుత్వం ఏం చేసిందో.. ఏయే జిల్లాల్లో ఖర్చు పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

  అలాగే రాజధాని పరిపాలనా భవనాల కోసం రూ.1500కోట్లు ఇచ్చామని.. ఆ నిధుల్ని కూడా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనుకున్న దానికంటే కేంద్రం ఎక్కువే ఇచ్చిందని గతంలో చంద్రబాబు, సుజనా చౌదరి సైతం చెప్పారని, తీరా ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు.

  హోదా లేకపోతేనేమి..:

  హోదా లేకపోతేనేమి..:

  ప్రత్యేక హోదా లేకపోయినా రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదా? అని ప్రశ్నించారు. హోదా లేదని పరిశ్రమలేమి వెనక్కి వెళ్లడం లేదు కదా అని నిలదీశారు.

  దుగరాజపట్నం ఓడరేవు వాస్తవానికి కాంగ్రెస్ హయాంలోనే మంజూరైందని, భూసేకరణలో అభ్యంతరాల వల్లే అంతరాయం ఏర్పడిందని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇస్తే కేంద్రం దానికి నిధులు మంజూరు చేస్తుందన్నారు.

  ఇవీ చేశాం..:

  ఇవీ చేశాం..:


  24గంటల విద్యుత్ కోసం మూడు రాష్ట్రాలను ఎంపిక చేస్తే అందులో ఏపీని చేర్చాం.
  ఏ రాష్ట్రానికి లేనివిధంగా ఏపీకి 16 యూనివర్సిటీలు మంజూరు చేశాం.
  కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం కేంద్రం పరిశీలనలో ఉంది.
  పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని ఇప్పటికీ చెబుతున్నాం.

  ఇవి కూడా:

  ఇవి కూడా:

  చట్టంలో ఉన్న 8 కేంద్ర సంస్థలను నెలకొల్పాం.
  అమరావతికి ఇప్పటికే 2500కోట్లు ఇచ్చారు.
  భవనాల నిర్మాణానికి 1500కోట్లు మంజూరు చేశాం.
  కేంద్రం తీసుకున్న మూడు పార్లమెంట్ స్థానాల్లో ఒక మెడికల్ కాలేజ్ నిర్ణయం మేరకు.. త్వరలోనే దాని అమలు కూడా జరుగుతుంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP MLC Somu Veerraju once again said that Central did more for Andhrapradesh than what they expect. Still central taking special care on state, he added.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి