వివేకా కేసులో కేంద్రం స్టాండ్ ఇదే- ఏపీలో వైసీపీ-టీడీపీ షేర్ 60:40- సోము వీర్రాజు షాకింగ్..
ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్రం స్టాండ్ ఏంటో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చిచెప్పేశారు.
ఏపీలో వైసీపీ, టీడీపీ ఇద్దరికీ మద్దతిచ్చేది లేదని తాజాగా మరోమారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంచేశారు. రాష్ట్రంలో వనరులను రెండు పార్టీలు దోచేస్తున్నాయన్నారు. 60:40 అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు పంచుకుంటున్నాయన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన విధంగానే నేడు వైసీపీ ప్రభుత్వం అవినీతి రాజకీయాలు చేస్తున్నాయన్నారు. వాళ్లకు సహకరించకుంటే వేయి కోట్లు ప్యాకేజి అంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. చైనాను లొంగదీసుకున్న బీజేపీకి, వీళ్లంతా ఓ లెక్కా అని సోము ప్రశ్నించారు.
వైసీపీ, టీడీపీల్ని తాము వ్యతిరేకిస్తుంటే.. తెలుగు దేశం వాళ్లు వైసీపీ ఏజెంట్లు అని,వైసీపీ వాళ్ళు టీడీపీ ఏజెంట్లు అని బీజేపీపై వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయానికి ఎట్టి పరిస్థితుల్లో లోగే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి రాజకీయాలకు బీజేపీ చరమగీతం పాడుతుందన్నారు. నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటున్నారని, కుటుంబ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించదని అన్నారు. ఉప ఎన్నికల్లో బాసులు తొలి దొంగ ఓట్లు వేయించారని, 10వ తరగతి పాస్ అయిన వారికి సైతం ఓట్లను పట్టభద్రుల ఓట్లను ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అని సోము ఆరోపించారు.
రాయలసీమలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ రెడ్డిని కేంద్ర బీజేపీ పార్టీ బీఫార్మ్ ఇచ్చిందని సోము తెలిపారు. బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులకు జనసేన మద్దతు ఉందన్నారు. వైసీపీ మాట్లాడేవి బంగారు రేకులపై అక్షరాలా...??అని ప్రశ్నించారు. బడ్జెట్ లో నిధులు రాకుంటే, ఎందుకు బుగ్గన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వద్దనే ఉన్నారన్నారు. ఈ బడ్జెట్ లో అత్యధిక నిధులు ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. మోడీతోనే అభివృద్ధి సాగుతుందని, 60 పధకాలు కేంద్ర ప్రభుత్వానివే అన్నారు.

తనపై తిరుగుబాటు ప్రారంభం అయిందని ఛానెల్స్ లో మీరే రాసుకొని, మీరే అడుగుతున్నారని మీడియాపైనా సోము విమర్శలకు దిగారు. వాస్తవాలు ఒక్క ముక్క మాత్రం బయటకు ఛానెల్స్ రాయడం లేదన్నారు. అభివృద్ధిపై డిబేట్ పెట్టండి, మేము రెడీ అన్నారు. అప్పర్ భద్ర కట్టిన రాయలసీమకు వచ్చే నీళ్లు ఎక్కడ రాకుండా ఆగదన్నారు.రాయలసీమకు వచ్చే నీళ్ల వాటాను కచ్చితంగా వచ్చేలా చేస్తామన్నారు. లక్షల కోట్ల రూపాయలతో రోడ్లు వేసిన ఘనత బీజేపీదేనన్నారు. నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం ఎంతవరకు సబబు..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర నిధులతో మాత్రమేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు.వైసీపీ ని ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు.
మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్రం జోక్యం ఉండదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కేంద్రం ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయదన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల అవినీతి కనిపించకుండా ఏదో ఒక ఇష్యూపైకి దృష్టి మళ్లించి రాజకీయం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications