జగన్ ను వదిలేసి కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా ? చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైర్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ముందు విభజన హామీల విషయంలోనూ రాజకీయ పార్టీలు కేంద్రాన్ని నిందించడం మొదలుపెట్టాయి. దీంతో బీజేపీ నేతలు కూడా ఈ విమర్శలకు రియాక్ట్ అవుతున్నారు. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు విభజన హామీలపై తాజాగా చేసిన డిమాండ్ పై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కౌంటర్ ఇచ్చారు.

somu veerraju

తాను వదిలేస్తే జగన్ అప్పట్లో రాష్ట్రమంతా తిరిగారని చంద్రబాబు అంటున్నారని, అప్పట్లో జగన్ పాదయాత్రలు చేస్తుంటే వదిలేసి ఇప్పుడు కేంద్రాన్నిటార్గెట్ చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. నా వద్ద చాలా ప్రశ్నలు ఉన్నాయి... చంద్రబాబు అనుసరించిన విధానం అభ్యంతరం అంటూ తీవ్ర స్వరంతో చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ఒంగోలు లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న సోము.. పలు అంశాలపై స్పందించారు.

somu veerraju

విభజన హామీల విషయంలో చంద్రబాబు వస్తే ఓకే వేదిక పై తన అభిప్రాయం చెప్తానని సోము వెల్లడించారు. పశ్చిమబెంగాల్, కేరళలో బిజెపి, సంఘ్ స్వయం సేవకులు హతమౌతున్నారని, ఆయా రాష్ట్రాల లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఇక్కడ అదే చేస్తోందన్నారు. రాజకీయ పార్టీ గా ఆయా రాష్ట్రాల లో ఏం చేసామో ఇక్కడ అదే చేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో అమిత్ షా కారు పై రాళ్ళు వేసి నప్పుడు బాబు ఏవిధంగా స్పందించారు ఇప్పుడు ఏవిధంగా స్పందిస్తున్నారని ప్రశ్నించారు.

somu veerraju

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వద్దంటే ఎవరు స్పందించలేదని, ఆయన సభలు అడ్డుకోలేదని సోము గుర్తుచేశారు. రైల్వేజోన్ విషయం లో కేంద్రంలో చక్రం తిప్పుతాను, అయిదుగురు ప్రధాన మంత్రులను మార్చానని తరచుగా చంద్రబాబు నాయుడు చెబుతారని, రైల్వే జోన్ ఎందుకు తీసుకు రాలేదని సోము ప్రశ్నిం చారు. ఇలాంటి అంశాలు తన దగ్గర చాలా ఉన్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+