రెండో పెళ్లి చేసుకున్నాడని తండ్రిన చంపిన తనయుడు
కడప: కన్న తండ్రినే ఓ కొడుకు కడతేర్చాడు. ఈ సంఘటన కడప జిల్లా పోరుమామిళ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్నాడనే కోపంతో కుమారుడు కన్నతండ్రిని హత్య చేశాడు. మోపూరి గోపయ్య (60) మొదటి భార్య 18 ఏళ్ల క్రితం చనిపోయింది.
అయితే, గత నెలలో గోపయ్య రెండో వివాహం చేసుకుని కడపలో నివాసం ఉంటున్నాడు. పోరుమామిళ్లలో ఉండే గోపయ్య కుమారుడు శుక్రవారం అతని ఇంటికి వెళ్లాడు. తండ్రి రెండో వివాహం చేసుకున్నట్లు అతనికి తెలిసింది.

దాంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తండ్రి మెడక్ టవల్ చుట్టి ఉరి వేశాడు. దీనిపై గోపయ్య రెండో భార్య మైదుకూరు డిఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications