తండ్రిని చంపిన తనయుడు, తల్లి సాయం: ఆత్మహత్య

 Son kills father with the help of mother
హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని జనగామ మండలం సిద్దంకిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ కసాయి కొడుకు కన్న తండ్రిని రోకలిబండతో మోదీ హత్య చేశాడు.

ఈ దారుణమైన ఘటనలో కుమారుడికి తల్లి సహకరించిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లి, కొడుకును పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.

ఈతకు వెళ్లి విద్యార్థులు మృతి

మెదక్ జిల్లాలోని న్యాల్కల్ మండలం శెనిగపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వెంటనే గజ ఈతగాళ్లు అక్కడకు చేరుకుని విద్యార్థుల మృతదేహాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

యువకుడి ఆత్మహత్య

ఇదిలావుంటే, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎస్ఐ రమేష్ వేధిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అట్రాసిటీ కేసు విషయంలో తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ చందూరికి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని రిమ్స్ వద్ద మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లివాడు వద్ద ద్విచక్రవాహనం - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ నర్సారావుతో పాటు ఆయన తండ్రి పాపయ్య కూడా మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+