ఆషాఢంలో అత్తింటికి వచ్చాడని అల్లుడి హత్య: మామకు జీవితఖైదు
తూర్పుగోదావరి: ఆషాఢ మాసంలో తరచూ తమ ఇంటికి వస్తున్నాడన్న కోపంతో అల్లుడిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన మామకు అమలాపురం రెండో అదనపు జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శివారు సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్కిరాజు, తన అల్లుడైన ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడికి చెందిన అమలదాసు సత్తి బాబును హత్య చేశాడు.

ఆషాఢ మాసంలో అత్తవారింటికి తరచూ రావద్దని పదే పదే చెప్పినా వినకపోవడంతో 2015, జులై 8న సత్తిబాబును కత్తితో నరికి చంపాడు అక్కిరాజు. కాగా, అప్పటికే మృతుడి భార్య దుర్గాభవాని 9నెలల గర్భిణీ.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు అక్కిరాజును అరెస్ట్ చేశారు.
ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఈ బుధవారం లోకినెడి అక్కిరాజుకు జీవిత ఖైదు విధించారు న్యాయమూర్తి బీఎస్వీ హిమబిందు. దీంతోపాటు రూ.2వేల జరిమానా విధించారు.












Click it and Unblock the Notifications