సోనియా గాంధీ వెనక్కి తగ్గరు: తెలంగాణపై డిఎస్

హైదరాబాద్: తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయానికి తిరుగు ఉండదని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. సమయం వృధా చేయకుండా తెలంగాణపై ముందుకు వెళ్లాలని ఆయన గురువారంనాడు అన్నారు.

కాగా, సోనియా గాంధీ సూచన మేరకే తాము ఓపిగ్గా ఉన్నామని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. 2014 ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని ఆయన అన్నారు. తెలంగాణ నిర్ణయం ఓట్ల కోసం, సీట్ల కోసం కాదని ఆయన అన్నారు.

 D Srinivas and Jana Reddy

తెలంగాణపై సోనియా గాంధీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నేత షబ్బీర్ అలీ అన్నారు. జనవరిలోగా తెలంగాణ ఏర్పడుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిన్నచూపు చూడడం తగదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో జరిగిన ఆత్మబలిదానాలు కనిపించడం లేదా అని ఆయన అడిగారు.

తెలంగాణపై కేంద్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన సీమాంధ్ర నేతలు ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+