chandrababuతో sonu sood -రియల్ హీరో కితాబు -ఇదేందయ్యా.. నేనెప్పుడూ చూడలే!
కరోనా విలయకాలంలో పేదల పాలిట ఆపద్భాంధవుడిగా, ప్రజల అవసరాలు తీర్చే పెన్నిధిగా అవతరించిన సినీ నటుడు, గొప్పదాత సోనూ సూద్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు అభినందించారు. సోనూ సూద్ రియల్ హీరో అంటూ కితాబిచ్చారు. కరోనా విపత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తోన్ సేవలపై శనివారం రివ్యూ నిర్వహించిన చంద్రబాబు.. వివిధ రంగాల ప్రముఖలతో ఫేస్ టైమ్ లో మాట్లాడారు..

వారియర్లకు బాబు సెల్యూట్
కొవిడ్‌పై పోరాటంలో కుటుంబ సభ్యులు కూడా బాధితుల వద్దకు వెళ్లడం లేదని.. అలాంటి కఠిన సమయాల్లో కరోనా బారిన పడినవారికి ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు అందిస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో ఆయన వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు సెల్యూట్ చేశారు.

సోనూ సూద్ రియల్ హీరో
ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తోన్న వైద్య సేవలపై చంద్రబాబు నిర్వహించిన వర్చువల్ భేటీలో నటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. విలయకాలంలో సోనూసూద్ సేవలను బాబు కొనియాడారు. రియల్ హీరోగా ఆపత్కాలంలో అందరికీ అండగా నిలుస్తున్నారని, సాయమడిగిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారని, సోనూసూద్ చేసిన సేవలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సోనూ.. ఈ గొప్ప పనిని ఇలాగే కొనసాగించాలని టీడీపీ చీఫ్ ఆకాంక్షించారు. కాగా,

ఇదేందయ్యా.. నేనెప్పుడూ చూడలే
తన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఎన్నో విపత్తులను చూశానని, అయితే, కరోనా వంటి సంక్షోభాన్ని చూడటం ఇదే తొలిసారి అని చంద్రబాబు అన్నారు. ప్రకృతి విపత్తు సమయాల్లో ఎన్టీఆర్ ట్రస్టు, టీడీపీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అదే సమయంలో జగన్ సర్కారుకూ చురకలు వేశారు. సేవ చేయడానికి ప్రభుత్వానికి ఎన్నో అధికారాలు, అవకాశాలు ఉంటాయని.. మూడో దశ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజా సేవ తమ అజెండా అని బాబు సెలవిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతోన్న కొవిడ్ సేవలపై శుక్రవారం నాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం రివ్యూ చేయడం తెలిసిందే.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications