Cruiser: చెన్నై టూ సింగపూర్.. వయా వైజాగ్.!
మన విశాఖపట్నం విహార ప్రపంచానికి సరికొత్త డెస్టినీగా మారబోతోంది. అద్భుత అందాలతో పులకరింపచేసే విశాఖ నగరం మీదుగా క్రూయిజ్‌లను నడిపేందుకు అత్యంత విలాసవంతమైన క్రూయిజ్ షిప్పుల సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముల్లోకాలను మైమరిపించే అందాలు ఉన్న విశాఖ నుంచి ప్రపంచంలోని పలు నగరాలకు క్రూయిజ్‌లను నడపాలని ప్లాన్ చేస్తున్నారట. విశాఖ నుంచి క్రూయిజ్ లు నడిపేందుకు ప్రపంచ ప్రఖ్యాత క్రూయిజ్ సంస్థ లిట్టోరల్ క్రూయిజ్స్ ఆసక్తిగా ఉంది.
కేవలం ఆసక్తి మాత్రమే కాదు ఆ దిశగా కార్యాచరణలోకి కూడా దిగేసింది ఆ సంస్థ. ఇటీవలే అద్భుతమైన 'స్టేట్ ఆఫ్ ది ఆర్ట్'తో విశాఖలో నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ మీదుగా డిసెంబర్ నుంచే తొలి సర్వీస్ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. లిట్టోరల్ క్రూయిజ్స్ మొదట చెన్నై నుంచి సింగపూర్‌కు విలాసవంతమైన క్రూయిజ్ సేవలు అందించేందుకు సిద్దమైంది. తొలి సర్వీసు నడిపేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసిన లిట్టోరల్ తాజాగా విశాఖ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనికి తోడు భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో పర్యటించే విధంగా ప్రారంభం కానున్న మరో క్రూయిజ్ సర్వీస్ కూడా ఆ రూట్‌లో విశాఖను కూడా కలపాలని నిర్ణయించారట.

ఆయా టూరిస్ట్ క్రూయిజ్ షిప్ ప్రతినిధులు విశాఖపట్నం పోర్టు అథారిటీ అధికారులతో పాటు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఆయా క్రూయిజ్‌ల విహారానికి అవసరమైన అనుమతులు కూడా ఇచ్చేందుకు వైజాగ్ పోర్టు అంగీకారం తెలిపింది. అతి త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సర్వీసుల వివరాల్ని వెల్లడించేందుకు చెన్నెకి చెందిన లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సిద్ధమైంది.
ముంబైలో ఈనెల 17 నుంచి 19 వరకు గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ - జీఎంఐఎస్ - 2023 జరిగింది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సమ్మిట్‌లో పలు ఒప్పందాలు జరిగాయి. ఈ సమ్మిట్‌లో పాల్గొన్న లిట్టోరల్ క్రూయిజెస్ లిమిటెడ్ ప్రమోటర్ రాజా వైజ్‌తో పాటు చెన్నెకి చెందిన వోక్ పోర్టు అథారిటీ, ట్యుటికోరిన్ పోర్టులు పరస్పర అంగీకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. వీటి ప్రకారం చెన్నై కేంద్రంగా విశాఖ మీదుగా రెండు క్రూయిజ్‌లు నడపాలని నిర్ణయం తీసుకున్నారు.
వాటిలో ఒకటి చెన్నై టూ సింగపూర్ వయా వైజాగ్. విశాఖలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, విశాఖ పోర్టు అథారిటీ ఇటీవలే సంయుక్తంగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఏడాది సెప్టెంబర్ 2న ప్రారంభించారు. ఆ అధునాతన టెర్మినల్ అందుబాటులోకి రావడంతో విశాఖ అంతర్జాతీయ డెస్టినేషన్‌గా మారింది. క్రూయిజ్‌లో విహరించేవారికి అవసరమైన అన్ని సౌకర్యాలుంటాయన్న కారణంతో ఈ సర్వీస్‌ను విశాఖ మీదుగా నడపాలని భావించినట్టు లిట్టోరల్ క్రూయిజ్ తెలిపింది.
జీఎంఐఎస్ - 2023లో జరిగిన మరో ఒప్పందంలో సుమారు 1,200 కోట్ల రూపాయల పెట్టుబడితో భారత్-శ్రీలంక మాల్దీవుల మధ్య మరో లగ్జరీ క్రూయిజ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ఈ సర్వీసును కూడా లిట్టోరల్ సంస్థనే నిర్వహించనుంది. వీలైనంత త్వరగా ఈ సర్వీసు కూడా విశాఖ మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నట్టు ఒప్పంద సంస్థ పేర్కొంది.
విశాఖ నుంచి చెన్నైకు గతంలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం కాక మునుపే ప్రముఖ క్రూయిజ్ షిప్ సంస్థ కార్డెలియా 11 అంతస్తులు ఉన్న విలాసవంతమైన క్రూయిజ్‌లను నడిపింది. అప్పట్లో వాటికి విపరీతమైన గిరాకీ ఉండేది. టెర్మినల్ లేకపోవడంతో పార్కింగ్‌తో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్డలియా తన గమ్యస్థానాలను మార్చుకుంది. దీంతో ప్రస్తుతం వస్తుందని ఆశిస్తున్న లిట్టోరల్ సంస్థ నిర్వహించనున్న క్రూయిజ్ షిప్ 10 అంతస్తుల మేర ఉండే అవకాశం ఉంది.
వీటిలో 1,200 నుంచి 1,500 మంది వరకూ ప్రయాణించవచ్చట. ఫుడ్ కోర్టులు, మల్టీ కుజైన్ రెస్టారెంట్లు, విలాసవంతమైన బార్లు, ఆహ్లాదాన్ని పంచే స్పా, గొప్ప సౌండ్ సిస్టమ్స్ ఉన్న థియేటర్, అంతకుమించిన నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్‌నెస్ సెంటర్, కిడ్స్ ప్లే సెంటర్‌లు ఒకటేమిటి స్వర్గం అంతా అక్కడే ఉండబోతోంది.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications